గర్భవతి అయిన హీరో చెల్లెలు

సల్మాన్ ఖాన్ ముద్దుల చెల్లి అర్పిత తెలుసు కదా .ఎక్కడో రోడ్డు మీద దొరికిన అనాధని తీసుకొచ్చి చెల్లెల్ని చేసుకోని పెంచుకున్నాడు.

 Salman Khan’s Sister Arpita Khan Becomes Pregnant-TeluguStop.com

ఏనాడు తనని పరాయిదానిలా చూడని సల్మాన్ 50 కోట్లకు పైగా ఖర్చుపెట్టి అంతా ఈర్ష్య పడేలా, అత్యంత ఘనంగా గత సంవత్సరం చివర్లో పెళ్లి జరిపించాడు.

ఇప్పుడు సల్మాన్ ముద్దుల చెల్లి గర్భవతి అని బాలివుడ్ లో చర్చ .చర్చ అనేది చిన్నపదం .బాలివుడ్ లో ఎక్కడ చుసినా ఈ విషయం గురించే మాట్లాడుకుంటున్నారట.వచ్చే సంవత్సరం మొదటి మూడు నెలల్లో సల్మాన్ ఖాన్ మామయ్యా కావడం ఖాయం అంటున్నారు.ఇటివలే సల్మాన్ తో పాటు గణేష్ ఉత్సవాలలో అర్పిత పాల్గొంది .అప్పుడే మీడియా వారు ఈ విషయాన్ని కనిపెట్టారు.

“అవును, అర్పిత ఇప్పుడు గర్భవతి.2016 తోలి మూడు నెలల్లో డెలివరి ఉంటుంది.ఈ విషయంపై సల్మాన్ కుటుంబ సభ్యులు చాలా ఆనందంగా ఉన్నారు.

సల్మాన్ ఇప్పటికే తన చెల్లి-బావకు, రాబోయే చిన్నారిగా ఎలాంటి బహుమతులు ఇవ్వాలో నిర్ణయించేసుకున్నాడు.సల్మాన్ ఇంట్లో ఇలా గణేష్ ఉత్సవాలు ముగిసాయో లేదో, ఇటు ఈ వార్తతో మరో పండుగ మొదలైంది ” అని తెలిపారు ఒక బాలివుడ్ సిని రిపోర్టర్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube