దర్శకుడిగా మరోసారి ఫెయిల్ అయిన ప్రభుదేవా

కొరియోగ్రాఫర్ గా కెరియర్ స్టార్ట్ చేసి తరువాత హీరోగా టర్న్ తీసుకొని తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న వ్యక్తి ప్రభుదేవా.స్టార్ కొరియోగ్రాఫర్ గా అన్ని బాషలలో సినిమాలు చేసిన ప్రభుదేవా తరువాత హీరోగా కోలీవుడ్, టాలీవుడ్ లో తనకంటూ ఒక గుర్తింపు క్రియేట్ చేసుకున్నాడు.

 Salman Khan's Radhe Declared A Disaster, Tollywood, Prabhudeva, South Remakes, K-TeluguStop.com

అయితే నటనకి గ్యాప్ ఇచ్చి నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాతో టాలీవుడ్ లో దర్శకుడుగా ప్రయాణం స్టార్ట్ చేసి మొదటి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టాడు.దీని తర్వాత ప్రభాస్ తో పౌర్ణమి మూవీని తెరకెక్కించారు.

పీరియాడిక్ టచ్ తో నడిచిన ఆ సినిమాలో సాంగ్స్ అన్ని సూపర్ హిట్ అయ్యాయి అయితే కంటెంట్ నేరేషన్ స్లోగా ఉండటంతో అనుకున్న స్థాయిలో ప్రేక్షకులకి రీచ్ కాలేదు.తరువాత పోకిరి సినిమాని తమిళ్ లో విజయ్ తో రీమేక్ చేసి హిట్ కొట్టాడు.

అలాగే శంకర్ దాదా జిందాబాద్ సినిమాతో చిరంజీవిని డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చింది.ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది.

బాలీవుడ్ లో మళ్ళీ పోకిరి సినిమాని సల్మాన్ ఖాన్ తో వాంటెడ్ అని రీమేక్ చేసి హిట్ కొట్టి అక్కడ తన ప్రయాణం స్టార్ట్ చేశాడు.ఓ వైపు నటుడుగా చేస్తూ మరోవైపు దర్శకుడుగా స్టార్ హీరోలతో యాక్షన్, కామెడీ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు చేస్తూ వచ్చాడు.

అయితే రీమేక్ ని నమ్ముకోకుండా ప్రభుదేవా సొంత కథలతో బాలీవుడ్ లో చేసిన అన్ని సినిమాలు డిజాస్టర్ అవుతూ వచ్చాయి.అయిన సల్మాన్ ఖాన్ దబాంగ్ 3 మూవీ ఆఫర్ ప్రభుదేవాకి ఇచ్చాడు.

ఆ సినిమా ఎవరేజ్ టాక్ తెచ్చుకుంది.మరోసారి రాధే సినిమా సినిమా అవకాశం ఇచ్చాడు.

అయితే ఈ సినిమాలో కథని పక్కన పెట్టి పూర్తిగా సౌత్ ఇండియా స్టైల్ లో యాక్షన్, ఎలివేషన్స్ మీదనే ప్రభుదేవా ఫోకస్ పెట్టడంతో డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది.ఈ దెబ్బతో బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ అభిమానులు నెటిజలు సైతం ప్రభుదేవాని ట్రోల్ చేస్తున్నారు.

దర్శకుడుగా ప్రభుదేవా ఫెయిల్ అయ్యారని ఇక కొరియోగ్రాఫర్ గా, యాక్టర్ గా చేసుకుంటే బెటర్ అంటూ కామెంట్స్ చేస్తూ ఉండటం విశేషం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube