సల్మాన్ ఫామ్ హౌస్ లో శవాలు అంటూ వ్యక్తి ఆరోపణలు.. ఏం జరిగిందంటే?

బాలీవుడ్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలలో ఒకరైన సల్మాన్ ఖాన్ సినిమాలకు, బిగ్ బాస్ షోకు కళ్లు చెదిరే స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని చాలా సందర్భాల్లో వార్తలు వచ్చాయి.నెగిటివ్ వార్తల కంటే పాజిటివ్ వార్తల ద్వారానే సల్మాన్ ఖాన్ పేరు మీడియాలో ఎక్కువగా వినిపిస్తుంది.

 Salman Khans Panvel Neighbour Ketan Kakkad Alleges Bodies Buried Farmhouse,salman Khan,defamation Case, Salman Khan Farm House, Ketan Kakkad, Salman Lawyer-TeluguStop.com

అయితే ఈ స్టార్ హీరోపై కేతన్ కక్కడ్ అనే వ్యక్తి సంచలన ఆరోపణలు చేయగా ఆ ఆరోపణల గురించి బాలీవుడ్ మీడియా వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

సల్మాన్ ఖాన్ కు పన్వేల్ లో సొంతంగా ఒక ఫాంహౌస్ ఉంది.

 Salman Khans Panvel Neighbour Ketan Kakkad Alleges Bodies Buried Farmhouse,salman Khan,defamation Case, Salman Khan Farm House, Ketan Kakkad, Salman Lawyer-సల్మాన్ ఫామ్ హౌస్ లో శవాలు అంటూ వ్యక్తి ఆరోపణలు.. ఏం జరిగిందంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఈ ఫాంహౌస్ లో సల్మాన్ ఖాన్ సినిమా హీరోయిన్ల శవాలను ఖననం చేశాడని కేతన్ కక్కడ్ సంచలన ఆరోపణలు చేశారు.ఒక యూట్యూబ్ ఛానల్ లో కేతన్ కక్కడ్ మాట్లాడుతూ సల్మాన్ ఖాన్ చిన్న పిల్లల అక్రమ రవాణాకు కూడా పాల్పడ్డాడని చెప్పుకొచ్చారు.

ఈ విషయం తన దృష్టికి రావడంతో సల్మాన్ ఖాన్ ఈ ఆరోపణలు చేసిన వ్యక్తిపై పరువు నష్టం దావా దాఖలు చేశారు.

సల్మాన్ ఖాన్ న్యాయవాది కోర్టులో కేతన్ కక్కడ్ అసత్య వార్తలను, కల్పిత వార్తలను ప్రచారం చేస్తున్నాడని చెప్పుకొచ్చారు.కేతన్ కక్కడ్ ఒక ఆస్తి వివాదం వల్ల సల్మాన్ ఖాన్ గురించి ఫేక్ వార్తలను ఈ విధంగా ప్రచారం చేస్తున్నాడని సల్మాన్ న్యాయవాది కామెంట్లు చేశారు.సోషల్ మీడియాలో కేతన్ కక్కడ్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలను తొలగించాలని సల్మాన్ న్యాయవాది కోరారు.

సల్మాన్ ఖాన్ పరువు నష్టం దావా కేసులో గూగుల్, ట్విట్టర్, యూట్యూబ్, ఫేస్ బుక్ పేర్లను కూడా ప్రస్తావించడం గమనార్హం.తమ ఫేవరెట్ హీరో గురించి తప్పుడు వార్తలు ప్రచారం చేసిన కేతన్ కక్కడ్ పై సల్మాన్ ఖాన్ అభిమానులు సైతం మండిపడుతున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube