స్టార్ డైరెక్టర్ రీమేక్ మూవీ కోసం నో చెప్పిన సల్మాన్

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రస్తుతం దబాంగ్ 3 చిత్రం తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే.ఇటీవల రిలీజ్ అయిన ఈ చిత్రం విజయవంతంగా ప్రదర్శించబడుతుంది.

 Salman Khanrejected Director Rohit Shetty Movie-TeluguStop.com

ఆయన బర్త్ డే వేడుకలు కూడా ముగియడం తో ప్రస్తుతం రాధే షూటింగ్ లో బిజీ కానున్న సల్లు భాయి బాలీవుడ్ స్టార్ దర్శకుడు రోహిత్ శెట్టి సినిమాకు నో చెప్పినట్లు తెలుస్తుంది.ఫరా ఖాన్ దర్శకత్వం వహించిన సెట్టే పే సట్టా చిత్రాన్ని రిమేక్ చేయాలనీ భావించిన ఈ క్రేజీ డైరక్టర్ కు సల్మాన్ నో చెప్పడం ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్ గా మారింది.

సెట్టే పే సట్టా చిత్రాన్ని రీమేక్ చేయాలనీ స్క్రిప్ట్ సహా వెళ్లి సల్మాన్ ను సంప్రదించగా కధ నచ్చకపోవడం తో స్టార్ డైరెక్టర్ అయినా సరే సల్లు భాయి నో చెప్పినట్లు తెలుస్తుంది.దీనితో రోహిత్ శెట్టి కాస్త నిరాశకు గురైనట్లు సమాచారం.

ఇప్పటికే ఇదే కథను హృతిక్ కు కూడా వినిపించగా హృతిక్ కూడా నో చెప్పినట్లు తెలుస్తుంది.హృతిక్ నో చెప్పడం తో రోహిత్ సల్మాన్ ను సంప్రదించగా కూడా అదే సమాధానం చెప్పడం తో రోహిత్ నిరాశకు గురైనట్లు ఇన్ సైడ్ టాక్.

మరి రోహిత్ చేతిలో ఉన్న ఈ కధ ఏహీరో కి నచ్చి ఒకే చెబుతారో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube