అక్కడ మూడోది వస్తుంది మరి ఇక్కడ..!  

Is Possible Third Part For Gabbar Singh-

మార్కెట్ పెరుగుతునా కొద్ది తెలుగు హింది సినిమాలు కూడా ఎక్కువ క్రేజ్ తెచ్చుకున్నాయి.ఇక అక్కడ సినిమాలు ఇక్కడ.ఇక్కడవి అక్కడకు రీమేక్ జరుగుతుండటం చూస్తున్నాం.అయితే బాలీవుడ్ సినిమాలను తెలుగులో రీమేక్ చేసిన వాటిలో సక్సెస్ రేటు చాలా తక్కువే.దబాంగ్ అంటూ దడలాడించిన సల్మాన్ ఖాన్ అక్కడ సూపర్ హిట్ కొడితే అదే సినిమా రీమేక్ తో గబ్బర్ సింగ్ అంటూ పది సంవత్సరాలుగా ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న హిట్ కిక్ ఇచ్చాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..

Is Possible Third Part For Gabbar Singh---

ఇక ఆ సినిమా తర్వాత సల్మాన్ దబాంగ్-2 కూడా చేశాడు.అది అక్కడ పర్వాలేదనిపించుకున్నా దబాంగ్ అంత హిట్ అవ్వలేదు.ఇక మన పవర్ స్టార్ కూడా సర్దార్ గబ్బర్ సింగ్ అంటూ చేసిన ఫలితం అందరికి తెలిసిందే.ప్రస్తుతం సుల్తాన్ సూపర్ హిట్ అవ్వడంతో ఖుషిగా ఉన్న సల్మాన్ ఖాన్ మరోసారి దబాంగ్ మేనియాలో ఓ సినిమా చేయాలని చూస్తున్నాడు.

ఇప్పటికే కథ సిద్ధం చేసుకున్నట్టు టాక్.మరి సర్దార్ గబ్బర్ సింగ్ ఎండ్ కార్డ్ లో రాజా సర్దార్ గబ్బర్ సింగ్ అంటూ టైటిల్ వేసిన పవన్ కూడా గబ్బర్ సింగ్ పొడిగింపు తీసే ఆలోచన ఉన్నట్టు అనిపిస్తుంది.మరి అక్కడ మూడోది స్టార్ట్ అవుతుంది మరి ఇక్కడ సినిమా పరిస్థితి ఏంటో అని అభిమానులు ఆరాటపడుతున్నారు.