బాటిల్ క్యాప్ ఓపెన్ ఛాలెంజే, కానీ వెరైటీగా  

Salman Khan Variety Bottle Cap Challenge-

ప్రస్తుతం సోషల్ మీడియా వేదిక గా వైరల్ అవుతున్న ఛాలెంజ్ బాటిల్ క్యాప్ ఓపెన్ ఛాలెంజ్.ఈ ఛాలెంజ్ ను అటు సామాన్యుల తో పాటు సెలబ్రిటీలు సైతం తెగ వీడియో చేసేసి సోషల్ మీడియా లో పోస్ట్ లు పెట్టేసి తెగ వైరల్ అయిపోతున్నారు.ఇప్పటికే అక్షయ్ కుమార్,సీనియర్ నటుడు అర్జున్, కేంద్ర మంత్రి కిరణ్ రిజుజి సహా పలువురు సెలబ్రిటీలు ఈ ఛాలెంజ్ ను చేసి సోషల్ మీడియా లో పోస్ట్ కూడా చేసేశారు...

Salman Khan Variety Bottle Cap Challenge--Salman Khan Variety Bottle Cap Challenge-

అయితే తాజాగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా ఈ బాటిల్ క్యాప్ ఓపెన్ ఛాలెంజ్ చేశాడు.అయితే అందరూ చేసినట్లు నేను చేస్తే ఏముంది అనుకున్నాడో ఏమో గాని నిజంగా చాలా డిఫరెంట్ గా ఈ ఛాలెంజ్ ని చేయడం విశేషం.సాధారణంగా బాటిల్ క్యాప్ ఓపెన్ ఛాలెంజ్ అంటే బాటిల్ క్యాప్ ని కాలితో తన్ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది.

కానీ సల్మాన్ మాత్రం కాలితో బాటిల్ ని తన్నకుండా నోటి తో గట్టిగా ఊది బాటిల్ క్యాప్ ని ఓపెన్ చేయడం విశేషం.

Salman Khan Variety Bottle Cap Challenge--Salman Khan Variety Bottle Cap Challenge-

కేవలం వాటర్ బాటిల్ క్యాప్ ఓపెన్ చేయడానికి మాత్రమే కాకుండా దీని ద్వారా ఓ మెసేజ్ ఇవ్వాలని అనుకున్న కండల వీరుడు నోటి తో ఊది క్యాప్ ని ఓపెన్ చేసి బాటిల్ నీళ్లు తాగి, నీటిని వృధా చేయకండి అంటూ ఒక సందేశం అందించాడు.వేరే ఎవరైనా అయితే పెద్దగా పట్టుకొనేవారు కాదేమో కానీ, సల్మాన్ ఈ మెస్సేజ్ ఇవ్వడం తో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో పెద్ద వైరల్ గా మారిపోయింది.