సల్మాన్ ఖాన్ నా బూట్లు మోసేవాడు.. నటుడి సంచలన వ్యాఖ్యలు..?

ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నంబర్ 1 హీరో అనే సంగతి తెలిసిందే.సల్మాన్ ఖాన్ నటించిన రాధే సినిమా ఇటీవల ఓటీటీలో విడుదలై ఫ్లాప్ రిజల్ట్ ను అందుకుంది.

 Salman Khan Used To Handle My Clothes And Boots Says Jackie Shroff-TeluguStop.com

అయితే ప్రముఖ నటుడు జాకీ ష్రాఫ్ తాజాగా సల్మాన్ ఖాన్ గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.సల్మాన్ ఖాన్ తండ్రి అబ్దుల్ రషీద్ ఖాన్ బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా సినిమాలకు రచయితగా పని చేశారు.

అబ్దుల్ రషీద్ పలు సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు.అయితే సల్మాన్ ఖాన్ మాత్రం సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ మొదట దర్శకుడు కావాలని అనుకున్నారట.స్వయంగా జాకీ ష్రాఫ్ ఈ విషయాలను వెల్లడించారు.కొందరు డైరెక్టర్ల దగ్గర సల్మాన్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారని కూలి వాళ్లు ఏ పనులు అయితే చేస్తారో సల్మాన్ సెట్స్ లో ఉన్న సమయంలో అలాంటి పనులే చేసేవారని జాకీ ష్రాఫ్ అన్నారు.

 Salman Khan Used To Handle My Clothes And Boots Says Jackie Shroff-సల్మాన్ ఖాన్ నా బూట్లు మోసేవాడు.. నటుడి సంచలన వ్యాఖ్యలు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

గడిచిన మూడు సంవత్సరాలుగా సల్మాన్ ఖాన్ తనకు తెలుసని ఆయన అన్నారు.

Telugu 100 Crores Remuneration, Abdul Rasheed Khan, Assistant Director, Falak Movie, Handle His Clothes, Jackie Shroff About Salman Khan, Jockie Shraff, Maine Pyaar Kiya, Salman Khan, Salman Khan Boots, Salman Khan Father-Movie

1988 సంవత్సరంలో ఫలక్ అనే సినిమాకు సల్మాన్ పని చేస్తున్న సమయంలో సల్మాన్ తన బూట్లతో పాటు బట్టలు కూడా మోశారని జాకీ ష్రాఫ్ చెప్పుకొచ్చారు.అయితే అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేస్తున్న సమయంలోనే హీరో కావాలని సల్మాన్ ఖాన్ అనుకున్నారని సల్మాన్ హీరో కావడానికి తాను సహాయం చేశానని జాకీ ష్రాఫ్ తెలిపారు.

సల్మాన్ ఖాన్ కు మైనే ప్యార్ కియా అనే సినిమాలో ఛాన్స్ దక్కిందని ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో తరువాత రోజుల్లో సల్మాన్ ఖాన్ వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదని జాకీ ష్రాఫ్ అన్నారు.

ప్రస్తుతం సల్మాన్ ఖాన్ ఒక్కో సినిమాకు 100 కోట్ల రూపాయలకు అటూఇటుగా పారితోషికం తీసుకుంటున్న సంగతి తెలిసిందే.

#100Crores #Jockie Shraff #Salman Khan #JackieShroff

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు