ఎస్పీ బాలు ఆరోగ్యంపై భావోద్వేగానికి గురైన సల్మాన్ ఖాన్  

Salman Khan Tweet on SP Balu Health Condition, Music Director Taman, Bollywood, Indian Cinema, Celebrity Wishes, SP Balu, Salman Khan - Telugu Bollywood, Celebrity Wishes, Indian Cinema, Music Director Taman, Salman Khan, Salman Khan Tweet On Sp Balu Health Condition, Sp Balu

లెజెండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వార్తలు వస్తున్న నేపధ్యంలో దేశ వ్యాప్తంగా అన్ని చిత్ర పరిశ్రమలలో సెలబ్రెటీ ప్రముఖులు స్పందిస్తున్నారు.దేశ వ్యాప్తంగా అన్ని భాషలలో పాటలు పాడిన సుప్రసిద్ధ గాయకుడుగా, గాన గాంధర్వుడు అనిపించుకున్న ఎస్పీ బాలు కోసం ఆయన అభిమానులు ప్రత్యేకంగా పూజలు చేస్తున్నారు.

TeluguStop.com - Salman Khan Tweet On Sp Balu Health Condition

ఆయన కోలుకోవాలని అతన్ని అభిమానించే ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు.ఎంతో మందికి గురువుస్థానంలో ఉన్న అతని గొంతు మళ్ళీ వినాలని పరితపిస్తున్నారు.

అయితే ప్రస్తుతం వెంటిలేషన్ మీద చికిత్స తీసుకుంటున్న ఆయన పరిస్థితిపై అంతా గందరగోళంగా ఉంది.ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం బయటకి రాలేదు.

TeluguStop.com - ఎస్పీ బాలు ఆరోగ్యంపై భావోద్వేగానికి గురైన సల్మాన్ ఖాన్-General-Telugu-Telugu Tollywood Photo Image

కొంత మంది అత్యుత్సాహంతో బాలు చనిపోయారని పోస్టులు పెడుతున్న వాటిలో వాస్తవం లేదనే మాట వినిపిస్తుంది.
ఇదిలా ఉంటే తాజాగా, బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఎస్పీ బాలు ఆరోగ్యంపై స్పందించాడు.“బాలసుబ్రహ్మణ్యం సర్ మీరు త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని ట్వీట్ చేశాడు.తనకోసం ఎన్నో పాటలు పాడి తనను స్పెషల్‌గా మార్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు చెప్పాడు.

చివర్లో మీ దిల్ దివానా హీరో ప్రేమ్.లవ్ యూ సర్” అని భావోద్వేగంగా ట్వీట్ చేశారు.

ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ ఓ వీడియోను పోస్టు చేసి భావోద్వేగానికి గురయ్యాడు లాక్‌డౌన్‌కు ముందు మార్చి నెలలో తనకెంతో ఇష్టమైన మామ ఎస్పీబీతో చాలా సరదాగా గడిపామని, ఇప్పుడు ఈ వీడియో చూస్తుంటే తనకు కన్నీళ్లు ఆగడం లేదని పేర్కొన్నాడు.మామా దయచేసి త్వరగా కోలుకోండి.

ఆయన ఆరోగ్యం కోసం ప్రతి ఒక్కరు ప్రార్థించండి అంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు.ప్రధాని మోడీతో సహా చిత్ర పరిశ్రమలో ప్రముఖులు అందరూ బాలు ఆరోగ్యం మెరుగుపడి, మరల మామూలు స్థితికి రావాలని ప్రార్థిస్తున్నారు.

#SalmanKhan #Salman Khan #SP Balu #MusicDirector

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Salman Khan Tweet On Sp Balu Health Condition Related Telugu News,Photos/Pics,Images..