మహేష్ బాబు-మురుగదాస్ సినిమా.అద్భుతమైన కాంబినేషన్.
నిర్మాతలు ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్.ఖర్చుకి వెనుకాడని ప్రొడ్యూసర్స్.80-100 కోట్ల బడ్జెట్ .ఇది కూడా సూపర్.చిత్రాన్ని లావిష్ గా తెరకెక్కించొచ్చు.హారిస్ జయరాజ్ సంగీతం అంటే మినిమం గ్యారెంటి ఆల్బమ్.ఇక హీరోయిన్ గా పరిణీతి చోప్రాని అనుకుంటున్నారు .అందంతో పాటు ఆభినయం ఉన్న నటి
అన్ని కుదిరాయి .కాని ఇంకా ఒక కన్ఫ్యూజన్ ఉండిపోయింది… ఈ చిత్రాన్ని ఇలానే హిందీలోకి డబ్ చెద్దామా లేక రీమేక్ చెద్దామా అని … ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే .రిమేక్ చేస్తే ఈ సినిమాని హిందీలో మహేష్ బాబు చేయడు … సల్మాన్ ఖాన్ చేస్తాడు
మీకు గుర్తుందో లేదో కాని తెలుగుస్టాప్ కొన్ని నెలల క్రితమే మురుగదాస్ సల్మాన్ ఖాన్ కి కథ చెప్పిన విషయాన్ని తెలియజేసింది.ఇదే విషయాన్ని పట్టుకోని అయోమయంగా ఉన్నాడు మురుగదాస్.తెలుగు,తమిళ భాషల వరకే మహేష్ తో తీసి .హిందీలో సల్మాన్ ఖాన్ తో రిమేక్ చెద్దామా లేక హిందీలో కూడా మహేష్ తో తీసిందే డబ్ చెద్దామా అని అలోచిస్తున్నాడు ఈ గజిని డైరెక్టర్
అయితే రిమేక్ చేసే చాలా తక్కువే అంటున్నారు ఫిలీంనగర్ జనాలు.సల్మాన్ కూడా ఇప్పుడు చాలా బిజీ.
ఈ మ్యాటర్ కాస్త అటు ఇటు పల్టీలు కొడుతున్నా, బాలివుడ్ మార్కేట్ పైకి మహేష్ దండయాత్ర మొదలుపెట్టడం ఖాయంగానే కనిపిస్తోంది.