మరో సౌత్ రీమేక్ లో సల్మాన్  

Salman Khan To Remake Maharshi Movie-

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ మరో రీమేక్ లో నటిస్తున్నట్లు తెలుస్తుంది.సల్మాన్ సౌత్ సినిమాల రీమేక్ లో ముందుంటాడు అన్న విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే సల్మాన్ దాదాపు 10 సౌత్ సినిమాల రీమేక్స్ లో నటించాడు.అయితే ఇప్పుడు తాజాగా మరో సౌత్ సినిమా రీమేక్ కు సల్లు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తుంది..

Salman Khan To Remake Maharshi Movie--Salman Khan To Remake Maharshi Movie-

ఇంతకీ ఆ సినిమా ఏమిటంటే ఇటీవల మహేష్ బాబు,వంశీ పైడి పల్లి దర్శకత్వం లో రిలీజైన ‘మహర్షి’.గత వారం రిలీజైన ఈ చిత్రం బాక్సాఫిస్ దగ్గర కలెక్షన్ ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు ఈ సినిమా ను రీమేక్ చేసే పనిలో పడ్డారట.ఈ మూవీ ని సల్మాన్ కు చూపించి ఒకవేళ ఆయన గనుక ఒకే అంటే ఈ చిత్రాన్ని రీమేక్ చేయాలనీ దర్శక నిర్మాతలు పనిలో పడినట్లు తెలుస్తుంది.

ఇప్పటికే ‘రెడీ’,’కిక్’, ‘వాంటెడ్’ ఇలా పలు రీమేక్ లలో నటించిన సల్మాన్ కు ‘మహర్షి’ ఎంతవరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.