ఇండియన్ సీక్రెట్ ఏజెంట్ బయోపిక్ లో సల్మాన్ ఖాన్

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై సీక్రెట్ ఏజెంట్ సినిమాలు చాలా వచ్చాయి.ఇలాంటి సినిమాలు మేగ్జిమమ్ సూపర్ హిట్ అయ్యాయి.

 Salman Khan To Play Indian Spy Ravindra Kaushik-TeluguStop.com

సీక్రెట్ ఏజెంట్ స్టోరీస్ అంటే అందులో థ్రిల్లింగ్ అంశాలతో పాటు, ఇంటరెస్టింగ్ కథనం కూడా ఉంటుంది.వారి జర్నీలో చాలా మలుపులు కూడా ఉంటాయి.

ఇవన్ని ప్రేక్షకులకి ఆసక్తి పెంచుతాయి.ఈ కారణంగా స్పై థ్రిల్లర్ కథలకి ప్రపంచ వ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంటుంది.

 Salman Khan To Play Indian Spy Ravindra Kaushik-ఇండియన్ సీక్రెట్ ఏజెంట్ బయోపిక్ లో సల్మాన్ ఖాన్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ కథలు అన్ని రియల్ లైఫ్ లో స్పై ఏజెంట్స్ గా ఉన్నవారి జీవితాల నుంచి స్ఫూర్తిగా తీసుకొని తెరకెక్కించినవే కావడం విశేషం.ఇదిలా ఉంటే రవీంద్ర కౌశిక్ పేరు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

ఇండియన్ రియల్ సీక్రెట్ ఏజెంట్ గా దేశ వ్యాప్తంగా అతని పేరు అందరికి సుపరిచితమే.

Telugu Block Tiger, Bollywood, Indian Secret Agent, Indian Spy Ravindra Kaushik, Radhe Movie, Salman Khan-Movie

సీక్రెట్ ఏజెంట్ గా పాకిస్తాన్ లో కొన్ని దశాబ్దాల పాటు సీక్రెట్ ఏజెంట్ గా ఉంటూ అక్కడి రహస్యాలని భారత్ కి అందించేవారు.రవీంద్ర కౌశిక్ కి అందరూ బ్లాక్ టైగర్ అని కూడా పిలుస్తారు.అలాంటి వ్యక్తి రియల్ లైఫ్ స్టొరీ ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పై రాబోతుంది.

ఇక ఈ బయోపిక్ లో రవీంద్ర కౌశిక్ పాత్రలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నటించబోతున్నట్లు సమాచారం.రాజ్ కుమార్ గుప్తా దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కనుంది.

సుమారు ఐదేళ్ళ పాటు ఎన్నో పరిశోధనలు చేసి రాజ్ కుమార్ రావేంద్ర కౌశిక్ కథని సిద్ధం చేశారని బిటౌన్ లో వినిపిస్తుంది.ప్రస్తుతం సల్మాన్ ఖాన్ కమిట్ మెంట్స్ అన్ని కూడా పూర్తయిన తర్వాత రవీంద్ర కౌశిక్ బయోపిక్ ని స్టార్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది.

ఇక ఈ మూవీకి బ్లాక్ టైగర్ అనే పేరునే పెట్టనున్నట్లు సమాచారం.

#IndianSpy #IndianSecret #Salman Khan #Block Tiger

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు