ఇండస్ట్రీలోకి బ్లాక్ బస్టర్ రీమేక్ తో ఎంట్రీ ఇవ్వనున్న సల్మాన్ మేనకోడలు!

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలోకి వారసులు ఎంట్రీ ఇవ్వడం సర్వసాధారణం.అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో వారసులకు బదులుగా వారసురాలు ఎక్కువగా ఎంట్రీ ఇస్తుంటారు.

 Salman Khan To Launch Another Family Member In Bollywood , Alizeh Agnihotri, Bad Genius Remake, Bollywood Debut, Cinema News, Salman Khan , Raj Veer-TeluguStop.com

ఇప్పటికే ఎంతోమంది వారసురాలు బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ లుగా కొనసాగుతున్నారు.ఇదిలా ఉండగా తాజాగా మరొక వారసురాలు కూడా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది.

బాలీవుడ్ బాయ్ ఫ్రెండ్ సల్మాన్ ఖాన్ కుటుంబం నుంచి సల్మాన్ వారసురాలిగా తన మేనకోడలు అలీజా అగ్నిహోత్రి ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమైనట్టు తెలుస్తోంది.ఇక ఈ సినిమా ద్వారా మరొక హీరో సన్నీడియోల్ కుమారుడు రాజ్ వీర్ కూడా వెండితెరకు పరిచయం కానున్నట్లు తెలుస్తోంది.

 Salman Khan To Launch Another Family Member In Bollywood , Alizeh Agnihotri, Bad Genius Remake, Bollywood Debut, Cinema News, Salman Khan , Raj Veer-ఇండస్ట్రీలోకి బ్లాక్ బస్టర్ రీమేక్ తో ఎంట్రీ ఇవ్వనున్న సల్మాన్ మేనకోడలు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇలా వీరిద్దరు  ‘బ్యాడ్ జీనియస్‌‘ సినిమా రీమేక్ ఈ చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం.

ఇక ఈ రీమేక్ చిత్రానికి దర్శకత్వం వహించడం కోసం బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సూరజ్ బర్జత్యా కుమారుడు అవినాష్ బర్జత్యాను డైరెక్టర్ గా రంగంలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది.2017 వ సంవత్సరంలో విడుదలైన  ‘బ్యాడ్ జీనియస్‌’ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లను రాబట్టింది.ఈ క్రమంలోనే ఈ సినిమాను హిందీలో రీమేక్ చేయాలని భావించారు ఈ సినిమా ద్వారా సల్మాన్ మేనకోడలు హీరోయిన్ గా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.

ఇక ఈ విషయం గురించి అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube