బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సినిమా వస్తుందంటే కేవలం బాలీవుడ్ జనాలు మాత్రమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా లవర్స్ ఆయన సినిమా కోసం ఎంతో ఆతృతగా చూస్తుంటారు.భాయ్ అని ముద్దుగా పిలుచుకునే అభిమానులు ఆయన సినిమా వస్తుందంటే చిన్నసైజ్ పండగ వాతావరణాన్ని సృష్టిస్తారు.
ఇక సల్లూ భాయ్ సినిమాను తొలి ఆటకే చూడాలని వారు థియేటర్లకు పరుగులు పెడతారు.అంతటి క్రేజ్ ఉన్న సల్మాన్ ఖాన్ రీసెంట్ మూవీ ‘రాధే’పై రిలీజ్‌కు ముందు ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు.
అయితే ఈ సినిమా రిలీజ్ తరువాత అట్టర్‌ఫ్లాప్ అనే పదం కూడా సరిపోని విధంగా ఈ సినిమా దారుణమైన రిజల్ట్‌ను మూటగట్టుకుంది.ఈ సినిమా కోసం భాయ్ ఏకంగా సినిమా బడ్జెట్‌ను మించిన రెమ్యునరేషన్ తీసుకోవడం విశేషం.
సల్మాన్ తన సినిమాలకు భారీగా రెమ్యునరేషన్ పుచ్చుకుంటాడనే వాదన బిటౌన్‌లో ఎప్పటినుండో వినిపిస్తుంది.సినిమా రిజల్ట్‌తో సంబంధం లేకుండా ఆయన ఇలా భారీ రెమ్యునరేషన్ పుచ్చుకోవడం సరైన పద్ధతి కాదని పలువురు సినీ ఎక్స్‌పర్ట్స్ చెబుతూ వచ్చారు.
అయినా కూడా మన భాయ్ ఆ మాటలు పెడచెవిన పెట్టడంతోనే రాధే నిర్మాతలకు భారీ నష్టాలు మిగిలాయని విశ్లేషకులు అంటున్నారు.దీంతో ఇప్పుడు ఎలాగైనా బాక్సాఫీస్ వద్ద తన సత్తా మరోసారి చాటాలని సల్మాన్ భావిస్తున్నాడు.
ఈ క్రమంలోనే తన నెక్ట్స్ మూవీని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు.అయితే రెమ్యునరేషన్ విషయంలో ఎలాంటి కండీషన్ పెట్టుకోలేదట ఈసారి.
దీంతో నిర్మాతలు కూడా సంతోషంగా తమ సినిమాను భారీ బడ్జెట్‌తో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించాలని చూస్తున్నారు.మరి ఈసారైనా సల్లూ భాయ్ అదిరిపోయే హిట్ అందుకుని తిరిగి ఫాంలోకి వస్తాడేమో చూడాలి.