అల్లు అర్జున్ కి బిగ్ థాంక్స్ చెప్పిన సల్మాన్ ఖాన్..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.సక్సెస్ ఫుల్ సినిమాలు చేస్తూ కెరీర్‌ని ఫుల్ స్పీడప్ చేస్తున్నారు.

 Salman Khan Thanks Allu Arjun For Seetimaar Song , Radhe, Salman Khan, Dj Remake-TeluguStop.com

సుకుమార్‌తో చేస్తున్న ‘పుష్ప’ సినిమా ఆల్రెడీ 70 పర్సెంట్ కంప్లీట్ అయింది.కొరటాలతో చెయ్యాల్సిన సినిమా తప్పిపోవడంతో నెక్ట్స్ సినిమా ఎప్పుడు ఎవరితో? అనే చర్చలు జరుగుతున్నాయి.అందరు హీరోలు వరుసగా సినిమాల్ని లైన్లో పెడుతున్నారు.కానీ బన్నీ మాత్రం ఇంత వరకూ నెక్ట్స్ సినిమా విషయంలో క్లారిటీ ఇవ్వలేదు.‘పుష్ప’ బ్యాలెన్స్ 30 పర్సెంట్ షూట్ కంప్లీట్ చేసి ఆగస్ట్‌కి రిలీజ్ చేసేస్తే ఇక బన్నీ ఖాళీయే.అందుకే నెక్ట్స్ సినిమా మీద ఫోకస్ పెట్టారు.

బన్నీ అంతకుముందే వేణు శ్రీరామ్‌తో ‘ఐకాన్’ సినిమా కమిట్ అయ్యారు.ఆల్ మోస్ట్ షూటింగ్ స్టేజ్ వరకూ వెళ్లిన ఈ సినిమా అర్ధాంతరంగా ఆగిపోయింది.

‘వకీల్ సాబ్’ తో మళ్లీ బౌన్స్ అయిన వేణుతో ‘ఐకాన్’ ని స్టార్ట్ చేస్తున్నట్టు దిల్ రాజు అఫీషియల్‌గానే చెప్పారు.అయితే బన్నీ మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

వేణు శ్రీరామ్‌తో ‘ఐకాన్’ సంగతి క్లారిటీ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్‌కి సడెన్‌‌గా ప్రశాంత్ నీల్ లైన్లోకి వచ్చేశారు.ప్రజెంట్ ప్రభాస్‌తో ‘సలార్’ సినిమా చేస్తున్న ప్రశాంత్ నీల్ డిసెంబర్ నాటికి ఈసినిమా కంప్లీట్ చేసేస్తే.

ఇక జనవరి నుంచి బన్నీతో సినిమాని పట్టాలెక్కించొచ్చని ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

ఇటువంటి తరుణంలో అల్లు అర్జున్ పై సల్మాన్ ఖాన్ ప్రశంసలజల్లు కురిపించారు.సల్మాన్ ఖాన్ ప్రభుదేవా దర్శకత్వంలో ‘రాధే’ సినిమా చేస్తున్నారు.సినిమాను ఈద్ సందర్భంగా థియేటర్స్‌తో పాటు డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల చేయాలనుకుంటున్నారు.

రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.ఈ సినిమాలో సీటీమార్ సాంగ్‌ను విడుదల చేసారు.

అల్లు అర్జున్ హీరోగా నటించిన ‘డీజే’ సినిమాలోని సీటీమార్ సాంగ్‌ను హిందీలో దేవీశ్రీ ప్రసార్ ట్యూన్ ఇచ్చారు.ఈ పాటకు అల్లు అర్జున్ రేంజ్‌లో కాకపోయినా తన ఏజ్‌కు మించి సల్మాన్ దిషా పటానీతో కలిసి స్టెప్పులేశారు.

ఈ క్రమంలో సల్మాన్ ఖాన్ ఈ పాటలో అద్భుతంగా డాన్స్ చేసిన అల్లు అర్జున్‌ను ప్రత్యేకంగా ప్రశంసల వర్షం కురించారు.కరోనా కారణంగా ఇంట్లో సేఫ్‌గా ఉండాలంటూ అల్లు అర్జున్‌కు సూచన చేశారు.

అల్లు అర్జున్ కూడా సల్మాన్ ఖాన్ ట్వీట్ కు సంతోషం వ్యక్తం చేశారు.బడా స్టార్ తన డాన్స్ ను మెచ్చుకోవడం ఎంతో ఆనందంగా ఉందని బన్ని ఆనందం వ్యక్తం చేశారు.

ఈ చిత్రాన్ని ఒకేసారి థియేటర్స్‌తో పాటు ఓటీటీలో విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube