బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన రీసెంట్ మూవీ దబాంగ్ 3 రిలీజ్‌కు ముందు భారీ అంచనాలను క్రియేట్ చేసింది.ఈ సినిమాతో దబాంగ్ సిరీస్ సక్సెస్‌ను సల్మాన్ కొనసాగిస్తాడని అందరూ అనుకున్నారు.
చిత్ర యూనిట్ కూడా పూర్తి ధీమాగా ఉండటంతో ప్రమోషన్స్ కూడా భారీ స్థాయిలో చేశారు.అయితే సినిమా రిలీజ్ అయ్యి మంచి టాక్‌నే సొంతం చేసుకుంది.
కానీ కలెక్షన్ల పరంగా మాత్రం సల్మాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద అల్లాడుతోంది.రిలీజ్ అయ్యి 10 రోజులు దాటిన దబాంగ్ 3 చిత్రం ఇప్పటివరకు రూ.137 కోట్ల మేర వసూళ్లు సాధించింది.అయితే సల్మాన్ గత చిత్రాలతో పోలిస్తే ఇది చాలా తక్కువ అని చెప్పాలి.ఒకప్పుడు సల్మాన్ చిత్రాలు రూ.200 కోట్ల క్లబ్‌లో అవలీలగా ఎంటర్ అయ్యేవి.ఇప్పుడు మాత్రం సల్మాన్ చిత్రం ముక్కుతూ మూలుగుతూ కలెక్షన్లు రాబడుతోందని సినీ వర్గాలు తెలిపాయి.
మరో స్టార్ హీరో అక్షయ్ కుమార్ మాత్రం వరుస సినిమాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాడు.
అక్షయ్ నటించిన తాజా చిత్రం గుడ్ న్యూస్ రిలీజ్ అయ్యి వారం దాటకుండానే 100 కోట్ల క్లబ్‌లో చేరేందుకు రెడీ అయ్యింది.ఏదేమైనా బాక్సాఫీస్ వద్ద సల్మాన్ సత్తా తగ్గిందనే అంటున్నారు సినీ వర్గాలు.