మీ వల్ల ఎటువంటి ఉపయోగంలేదు.. బయటకు వెళ్లిపోండి అంటూ బిగ్ ‌బాస్ వార్నింగ్...!

ప్రస్తుతం తెలుగులో బిగ్ బాస్ 4వ సీజన్ నడుస్తుండగా మరోవైపు హిందీలో బిగ్ బాస్ 14వ సీజన్ ప్రారంభమైంది.ఇకపోతే అక్కడ రెండో వారంలో ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా కొన్ని సంఘటనలు చోటు చేసుకున్నాయి.

 Salman Khan Blasted Bigg Boss Contestants With Harsh Words, Salman Khan, Hardik-TeluguStop.com

ఇకపోతే వీకెండ్ కావడంతో కొందరు సెలబ్రెటీలు, క్రికెటర్లు బిగ్ బాస్ హౌస్ ను సందర్శించడం తో వీకెండ్ కాస్త హుషారుగా సాగింది.ఇకపోతే ఇంటి సభ్యుల ప్రవర్తనతో విసిగిపోయిన బిగ్ బాస్ కాస్త గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్లు అయ్యింది.

ఇకపోతే బిగ్ బాస్ ఇంట్లో ఉన్న కంటెస్టెంట్స్ ను పలకరించేందుకు ఐపీఎల్ లో ఆడుతున్న ముంబై ఇండియన్స్ కు సంబంధించిన కొందరు క్రికెటర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆన్లైన్లో ముచ్చటించారు.ఇందులో భాగంగా హౌస్ లో ఉన్న ఇజాజ్ ఖాన్ తో కలిసి ముంబై ఇండియన్స్ సరదాగా కొద్దిసేపు మాట్లాడుతూ కనిపించారు.

ఇందులో భాగంగానే ముంబై ఇండియన్స్ కు సంబంధించిన ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా బిగ్ బాస్ కొద్దీ సేపు సభ్యులతో కామెడీ చేశాడు.ఇందులో భాగంగానే హార్దిక్ పాండే ఇజాజ్ ఖాన్ ను బిగ్ బాస్ హౌస్ లో సిక్సర్లు, ఫోర్లు కొట్టేది ఎవరు అంటూ చిలిపిగా అడగగా దానికి సమాధానం ఇస్తూ ఇంకెవరో కాదు.

నేనే అని చెప్పడంతో క్రికెటర్లు నవ్వుల్లో మునిగిపోయారు.అయితే రెండు వారాల తర్వాత ఇంట్లో నుంచి ఎవరు బయటకు వెళ్తారో అన్న ఈ విషయంపై బాలీవుడ్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తుండగా ఆ సమయంలో సల్మాన్ ఖాన్ షాకిచ్చాడు.

బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కొంతమంది కంటెస్టెంట్స్ ను మీరు ఇంట్లో ఉండటం వల్ల పెద్దగా లాభం లేదు అంటూ విరుచుకుపడ్డాడు.దీంతో కంటెస్టెంట్స్ లో ఉన్న 10 మందిని మీరు బిగ్ బాస్ హౌస్ ను వదిలి వెళ్ళండి అంటూ పెద్ద షాక్ ఇచ్చాడు.

మీవల్ల ఇంట్లో వారికి సమస్యలు తప్ప మరో ఎలాంటి లాభం లేదంటూ సల్మాన్ ఖాన్ వారిపై మండిపడ్డారు.అంతేకాదు మితిమీరిన వేషాలు వేయవద్దని, ఓవర్ స్మార్ట్ గా ఆలోచించొద్దు అంటూ బిగ్ బాస్ హోస్ట్ గట్టి వార్నింగ్ ఇచ్చాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube