రైతుల కష్టం గుర్తించాలి అంటున్న సల్మాన్ ఖాన్  

Salman Khan Said Respect To Formers, Tollywood, Bollywood, Corona Effect, COVID-19, Celebrity Lifestyle - Telugu Bollywood, Celebrity Lifestyle, Corona Effect, Covid-19, Salman Khan Said Respect To Formers, Tollywood

లాక్ డౌన్ తర్వాత సెలబ్రెటీలు కొత్త జీవితాలని పరిచయం చేస్తున్నారు.ఇంతకాలం సినిమా షూటింగ్ లు అంటూ లైట్స్ మధ్య బ్రతికిన వారు వారి వ్యక్తిగత జీవితంలో ఆనందాల్ని వెతుక్కుంటున్నారు.

 Salman Khan Said Respect To Farmers

వారికి ఇష్టమైన పనులు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు.అందులో భాగంగా హీరోయిన్స్ వంటగదిలోకి తొంగి చూస్తూ కొత్త వంటలు నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.

కొంతమంది భామలు ఆన్లైన్ క్లాసులకి హాజరవుతున్నారు.కొంత మంది వ్యవసాయంపై మక్కువ చూపిస్తున్నారు.

రైతుల కష్టం గుర్తించాలి అంటున్న సల్మాన్ ఖాన్-General-Telugu-Telugu Tollywood Photo Image

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కి ఖాళీ సమయం దొరికితే తన ఫామ్ హౌస్ కి వెళ్ళిపోయి అక్కడ కాలక్షేపం చేస్తూ ఉంటాడు.అక్కడ తనకి ఇష్టమైన పనులు చేస్తూ ఆస్వాదిస్తూ ఉంటాడు.
లాక్ డౌన్ ప్రారంభమైనప్పటి నుండి సల్మాన్ ఖాన్ సిటీ ఔటర్ లోని పన్వెల్ ఫామ్ హౌస్ లో నివసిస్తున్నారు.సినిమా షూటింగ్ లు ప్రస్తుతం ఎలాగూ లేకపోవడంతో ఫామ్ హౌస్ లో పొలం పనిపై మక్కువ పెంచుకున్నాడు.

బాగా నీరు చేరిన పొలంలో దమ్ము పట్టిన బురదలో దిగి సల్మాన్ ఖాన్ వరి నాట్లు కూడా వేశాడు.పొలంలో వ్యవసాయం చేస్తూ రోజంతా గడిపిన సల్మాన్ ఖాన్ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టాడు.

పొలం పని ముగించుకొని గట్టుపై కూర్చున్న తన ఫోటోని షేర్ చేసి రైతులందరికీ గౌరవం ఇవ్వండి అనే క్యాప్షన్ ఇచ్చి ఈ ఫోటోని రైతులందరికీ అంకితమిచ్చాడు.మొత్తానికి సల్మాన్ ఖాన్ పెట్టిన ఈ పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా, చాలా మంది రైతులు సల్మాన్ ఖాన్ పోస్ట్ పై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇలాంటి గొప్ప నటుల ద్వారా అయినా తమ కష్టం అందరికి తెలుస్తుంది అని అంటున్నారు.

#Corona Effect #COVID-19

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Salman Khan Said Respect To Farmers Related Telugu News,Photos/Pics,Images..