మిలియన్ వ్యూస్ తో మొదటిరోజు రికార్డ్ క్రియేట్ చేసిన 'రాధే' !

బాలీవుడ్ బడా హీరో సల్మాన్ ఖాన్ బ్లాక్ బస్టర్ సినిమాలతో దూసుకు పోతున్నాడు.ప్రస్తుతం ఈయన నటించిన ‘రాధే’ సినిమా ఈద్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

 Salman Khan Radhe Movie Record Created-TeluguStop.com

డాన్స్ మాస్టర్ ప్రభుదేవా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కించాడు ప్రభుదేవా.

కరోనా కారణంగా ఇప్పటి వరకు ఈ సినిమా వాయిదా పడుతూ వస్తుంది.తాజాగా ఈ సినిమాను రంజాన్ కానుకగా మే 13 న విడుదల చేసారు.

 Salman Khan Radhe Movie Record Created-మిలియన్ వ్యూస్ తో మొదటిరోజు రికార్డ్ క్రియేట్ చేసిన రాధే’ -Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

సినిమాను థియేటర్స్ లోను ఓటిటి లోనూ ఒకే రోజు విడుదల చేయాలనీ ముందుగానే అనుకున్నారు.అయితే కరోనా ఉదృతి ఎక్కువుగా ఉండడం వల్ల థియేటర్స్ లో విడుదల అవ్వలేదు.

కానీ చెప్పిన విధంగానే ఓటిటీ లో మాత్రం విడుదల చేసింది చిత్ర యూనిట్.ఈ సినిమా విడుదల అయ్యి రికార్డ్ క్రియేట్ చేసిందనే చెప్పాలి.సల్మాన్ స్టామినా మరొకసారి నిరూపణ అయ్యింది.

బిగ్ స్క్రీన్ మీద రిలీజ్ అవ్వకపోయిన స్మాల్ స్క్రీన్ మీద రిలీజ్ అయ్యి కూడా రికార్డ్ వ్యూస్ తో పాటు రికార్డు స్థాయిలో కలెక్షన్లను రాబట్టింది.నెట్ ప్లెక్స్ మరియు జీ 5 లో పే ఫర్ వ్యూ కాన్సెప్ట్ తో విడుదల అయ్యింది.ఈ సినిమా ఎవ్వరు ఊహించని స్థాయిలో వ్యూస్ రాబట్టి అందరిని ఆశ్చర్య పరుస్తుంది.అంతేకాదు కలెక్షన్లు కూడా అలాగే రాబట్టి సల్మాన్ ఖాన్ స్టామినా నిరూపించింది.

ఈ సినిమా మొదటి రోజు విడుదల అయ్యి 4.3 మిలియన్ వ్యూస్ రాబట్టింది.బిగ్ స్క్రీన్ మీద లాగా మొదటి రోజు 100 కోట్లు కొల్లగొట్టి అందరిని ఆశ్చర్యపరిచింది సల్మాన్ రాధే మూవీ.ఈ సినిమా పే ఫర్ వ్యూ ద్వారా విడుదల అయ్యి హిట్ అవ్వడంతో మరి కొన్ని సినిమాలు కూడా ఇదే విధంగా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఇది ఇలా ఉండగా ఈ సినిమాలో దిశా పటాని హీరోయిన్ గా నటించింది.

#SalmanKhan #100 Crore #Salman Khan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు