బుల్లితెరపై ప్రసారమవుతున్న అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్( Bigg Boss ) కార్యక్రమం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
ఇక ఈ కార్యక్రమం తెలుగుతోపాటు ఇతర భాషలలో కూడా ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే.హిందీలో ఇప్పటికే 15 సీజన్లను పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం ఓటీటీలో కూడా ప్రసారమవుతూ ప్రేక్షకులను సందడి చేస్తుంది.
ఇకపోతే ఈ కార్యక్రమానికి సల్మాన్ ఖాన్ ( Salman Khan )మొదటి నుంచి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.గతవారం ప్రసారమైనటువంటి కార్యక్రమానికి ఈయన హాజరయ్యే సమయంలో చేతిలో సిగరెట్ పట్టుకుని వేదిక పైకి వచ్చారు.

ఈ విధంగా సల్మాన్ ఖాన్ చేతిలో సిగరెట్ ( Sigaret )పట్టుకుని స్టేజ్ మీదకు రావడంతో ఈ విషయాన్ని చాలామంది తప్పుపడుతూ భారీ స్థాయిలో విమర్శలు చేశారు.ఒకరికి మనం చెప్పేటప్పుడు మనం పర్ఫెక్ట్ గా ఉండాలని భారీ స్థాయిలో ట్రోల్స్ చేశారు.ఈ విధంగా సల్మాన్ ఖాన్ సిగరెట్ విషయంలో భారీగా వివాదాలను ఎదుర్కొన్నారు.ఇకపోతే ఈ సిగరెట్ వివాదంతో సల్మాన్ ఖాన్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

ఈ విధంగా సల్మాన్ సిగరెట్ చేతిలో పట్టుకొని స్టేజ్ పైకి వచ్చారని విమర్శలు వచ్చిన తరుణంలో ఈయన ఈ వారం బిగ్ బాస్ కార్యక్రమానికి హోస్ట్ గా స్టేజ్ పైకి రాలేదు.అయితే ఈయన ఇకపై ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా ఉండకూడదని షాకింగ్ డెసిషన్ తీసుకున్నారని అందుకే ఇలా ఈవారం బిగ్ బాస్ కార్యక్రమానికి సల్మాన్ ఖాన్ హాజరు కాలేదంటూ ఓ వార్త సంచలనగా మారింది.అయితే సల్మాన్ ఖాన్ ఇదే విషయం గురించి బిగ్ బాస్ కార్యక్రమానికి దూరమయ్యారా లేకపోతే ఏదైనా కొన్ని కారణాలవల్ల ఈయన ఈ వారం హాజరు కాలేకపోయారా అనేది తెలియాలి అంటే వచ్చే వారం వరకు వేచి చూడాల్సిందే.