హోమ్ క్వారంటైన్ లోకి సల్మాన్ ఖాన్.. ఎందుకు తెలుసా..?

తాజాగా బాలీవుడ్ సూపర్ స్టార్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ క్వారంటైన్ లోకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.సల్మాన్ ఖాన్ వ్యక్తిగత డ్రైవర్ అలాగే ఇతర సిబ్బందికి కరోనా పాజిటివ్ రావడంతో ఆయన హోమ్ క్వారంటైన్ లో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 Salman Khan Is Going To Home Quarantain ,home Quarantain, Salman Khan, Coronapos-TeluguStop.com

దీంతో సల్మాన్ ఖాన్ తన కుటుంబం సభ్యులతో కలిసి 14 రోజులపాటు ఐసొలేషన్ లో ఉండబోతున్నాడు.తన సిబ్బందిని వెంటనే ముంబై ఆస్పత్రిలో చేర్పించారు సల్మాన్ ఖాన్.

ప్రస్తుతం వారి కోసం వైద్య సహాయం అందించాలని ఆయన చర్యలు చేపడుతున్నారు.

Telugu Bigboss, Coronapositive, Quarantain, Salman Khan-Movie

ఈ నేపథ్యంలోనే సల్మాన్ ఖాన్ తన తల్లిదండ్రులు సలీం ఖాన్, సల్మా ఖాన్ వివాహ వార్షికోత్సవ కార్యక్రమాన్ని సైతం ఆయన రద్దు చేశాడు.ఇకపోతే ప్రస్తుతం ఆయన బిగ్ బాస్ 14వ సీజన్ కు పోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు.దీంతో తాజాగా బిగ్ బాస్ హోస్టింగ్ వ్యవహారం కాస్తా అయోమయంలో పడింది.14 రోజుల పాటు ఇంటికి పరిమితం కావాలని అనుకున్న సల్మాన్ ఖాన్ మరి వారాంతంలో వచ్చే బిగ్ బాస్ 14 సీజన్ హోస్ట్ బాధ్యతలను ఎలా నిర్వహిస్తారని అందరూ ఆలోచిస్తున్నాడు.

ఈ పరిస్థితుల్లో సల్మాన్ ఖాన్ తన హోస్టింగ్ బాధ్యతలను వేరే వాళ్లకు అప్పగించే అవకాశాలు కనబడుతున్నట్లు బిగ్ బాస్ వర్గాలు తెలియజేస్తున్నాయి.

ఇదివరకు కూడా సల్మాన్ ఖాన్ తన కుటుంబంతో కలిసి పాన్వెల్ లోని తన ఫామ్ హౌస్ లో తనను తాను నిర్బందించుకున్న సంగతి మనకు తెలిసిందే.ఆ సమయంలో ఆయన వారి కుటుంబ సభ్యులు, అలాగే స్నేహితులతో సరదాగా గడపటమే కాకుండా వారితో కలిసి వ్యవసాయం కూడా చేసి ఉల్లాసంగా గడిపాడు.

ఆ సమయంలోనే సల్మాన్ ఖాన్ కరోనా వైరస్ సంబంధించిన వీడియో లను కూడా విడుదల చేయడం జరిగింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube