పెళ్లి సంగతి ఏమోగానీ... త్వరలో తండ్రి మాత్రం కాబోతున్నకండల వీరుడు  

Salman Khan Is Going To Become A Father Son Through Surrogacy-salman Khan,surrogacy,the Most Eligible Bachelor,సరోగసి,సల్మాన్

ఒకప్పుడు సరోగసి అంటే ఎవరికీ తెలిసేది కాదు. ఎందుకంటే ఈ సరోగసి ద్వారా పిల్లలు కావాలి అని అనుకొనే వారు చాలా తక్కువ మంది ఉండేవారు. అయితే ఇప్పుడు ఈ సరోగసి గురించి ప్రత్యేకంగా ఎవరికీ చెప్పనక్కర లేదు..

పెళ్లి సంగతి ఏమోగానీ... త్వరలో తండ్రి మాత్రం కాబోతున్నకండల వీరుడు -Salman Khan Is Going To Become A Father Son Through Surrogacy

ఈ సరోగసి తో బాలీవుడ్ లో చాలా మంది ప్రముఖులుపిల్లలను కంటున్నారు. వారిలో షారూఖ్,ఏక్తా కపూర్,కరణ్ జోహార్ ఇలా చెప్పుకుంటూ పొతే చాలా మందే ఉన్నారు. ఈ సరోగసి పద్దతి టాలీవుడ్ లో కూడా పాకింది.

ఆ మధ్య లక్ష్మిమంచు సరోగసి ద్వారా నే ఆడబిడ్డకు తల్లి కాగా, సీనియర్ నటి రేవతి కూడా సరోగసి ద్వారా నే ఇటీవల తల్లి అయిన కధనాలు చాలానే ఉన్నాయి.

అయితే ఇప్పుడు తాజాగా బాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్ సల్మాన్ కూడా ఈ సరోగసి ద్వారానే తండ్రి కాబోతున్నట్లు తెలుస్తుంది. నిజానికి బాలీవుడ్ హీరో సల్మాన్, హీరోయిన్ కత్రినా కైఫ్ తో ప్రేమ పెటాకులవ్వడం తో కనీసం పెళ్లి ఊసు కూడా ప్రస్తావించడం లేదు. అయితే ఇప్పుడు ఆయన తండ్రి కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

పెళ్లి చేసుకోకుండానే ఓ బిడ్డకు తండ్రి కావాలని నిర్ణయం తీసుకున్నారట అందుకే సరోగసీ విధానం ద్వారా ఓ బిడ్డకు జన్మనివ్వాలని సల్లు భాయి భావిస్తున్నారు. అంతా అనుకున్నట్టు జరిగితే మరో యేడాదిలో ఈ కండల వీరుడు సల్మాన్ ఖాన్ భార్య లేకుండానే ఓ బిడ్డకు తండ్రికాబోతున్నాడన్నమాట. అయినా ఎంతో మంది బాలీవుడ్ ప్రముఖులు ఈ సరోగసి ద్వారా నే బిడ్లను కనగా సల్లు భాయి ఈ పద్దతి పాటించడం లో తప్పేముంది..