ఫ్రెష్ పేరుతో కొత్త వ్యాపారం మొదలుపెట్టిన సల్మాన్ ఖాన్  

Salman Khan Frsh Ramzan - Telugu Bollywood, Celebrities Business, Lock Down, Salman Khan Launches Personal Care Brand Frsh, Tollywood

సెలబ్రిటీలు అందరూ ఓ వైపు సినిమాలు చేస్తూ, నటులుగా సక్సెస్ ట్రాక్ ని లీడ్ చేస్తూ వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టడం మొదలుపెడుతున్నారు.ఇప్పటికే స్టార్ హీరోలు నిర్మాతలుగా మారిపోయి సినిమాలు నిర్మించే పనిలో ఉన్నారు.

 Salman Khan Frsh Ramzan

అలాగే కార్పోరేట్ వ్యాపారాలలో కూడా వేలు పెట్టారు.ఇదే బాటలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా చేరిపోయాడు.

ఇప్పటికే నిర్మాతగా సినిమాలు నిర్మిస్తున్న సల్మాన్ ఖాన్ ఫాషన్ ఉత్పత్తుల వ్యాపారంలోకి అడుగు పెట్టాడు.ప్రతి ఏడాది రంజాన్ సందర్బంగా కొత్త సినిమా రిలీజ్ చేసే సల్మాన్ ఖాన్ ఈ సారి తన సొంత బ్రాండ్ నుంచి శానిటైజర్ ని మార్కెట్ లోకి తీసుకొచ్చారు.

ఫ్రెష్ పేరుతో కొత్త వ్యాపారం మొదలుపెట్టిన సల్మాన్ ఖాన్-General-Telugu-Telugu Tollywood Photo Image

తన ఫాం హౌస్ లో గడుపుతున్న సల్మాన్ సోషల్ మీడియాలో ఈ మేరకు ఓ వీడియోను పోస్ట్ చేశాడు.ఫ్రెష్ పేరుతో ఈ శానిటైజర్ ని మార్కెట్ కి విడుదల చేస్తున్నామని చెప్పాడు.

ఈ బ్రాండుపై డియోడరెంట్, పెర్ ఫ్యూమ్స్ లని మార్కెట్ చేయాలనుకున్నామని, అయితే ప్రస్తుత పరిస్థితుల అవసరానికి తగ్గట్టుగా ముందుగా శానిటైజర్ ను రిలీజ్ చేస్తున్నామని సల్మాన్ చెప్పాడు.త్వరలోనే ఫ్రెష్ బ్రాండ్ నుంచి డియోడరెంట్స్, పెర్ ఫ్యూమ్స్ విడుదల చేస్తామని స్పష్టం చేశాడు.

మంచి నాణ్యతతో, సరసమైన ధరలతో ఉంటాయని చెప్పాడు.ఇప్పటికే సల్మాన్ తన సొంత బ్రాండులపై రెడీమేడ్ దుస్తులు, ఈ-సైకిల్స్, జిమ్, ఫిట్ నెస్ పరికరాలను మార్కెట్ చేసే వ్యాపారంలో కూడా వున్నాడు.

ఇప్పుడు బ్యూటీ ప్రొడక్ట్స్ మార్కెట్ లోకి కూడా తీసుకు వచ్చాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Salman Khan Frsh Ramzan Related Telugu News,Photos/Pics,Images..

footer-test