తాగుబోతు నటులు మేల్కొంటారా?  

Salman Khan Found Guilty-

బాలీవుడ్‌ అగ్ర హీరోల్లో ఒకడైన కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ను ముంబయి న్యాయస్థానం దోషిగా తేల్చింది.ఆయన దారుణమైన నేరం చేశాడని ధ్రువీకరించింది.అందుకు ఆయనకు పదేళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉంది.ఇంతకూ సల్మాన్‌ చేసిన నేరమేమిటి? ఫుల్లుగా తాగి కారు నడపడమే కాకుండా ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న అభాగ్యుల మీదికి కారు పోనిచ్చి ఒకరి హత్యకు కారకుడవడం.సినిమా హీరోలు, నటులు, నటీముణులు మద్యం తాగడం సాధారణ విషయమే.ఇక బాలీవుడ్‌ సంగతి చెప్పేదేముంది? ఇందుకు సల్మాన్‌ ఖాన్‌ అతీతుడు కాదు కదా.పదమూడేళ్ల కిందట ఆయన ఓ రోజు నైట్‌ బాగా తాగేసి కారు నడిపాడు.అది తిన్నగా పోకుండా ఫుట్‌పాత్‌ మీదికి ఎక్కింది.కొంపాగోడు లేని కొందరు పేదలు దానిపై నిద్రిస్తున్నారు.కారు వారి మీదికి ఎక్కింది.వారిలో ఓ వ్యక్తి చనిపోయాడు.నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.పోలీసులు డ్రంకెన్‌ డ్రైవ్‌ కింద కేసు బుక్‌ చేశారు.పదమూడేళ్ల క్రితం చేసిన నేరానికి బుధవారం శిక్ష ఖరారైంది.

దీంతో వెంటనే అరెస్టు చేసి జైలుకు తరలించారు.ఈ కేసులో పదేళ్ల జైలు శిక్ష పడుతుందని చెబుతున్నారు.

-

ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన నేరం కాకపోయినా శిక్ష పడే నేరం కిందకే వస్తుంది.కాబట్టే సల్మాన్‌ను కోర్టు దోషిగా తేల్చింది.మన హైదరాబాదులో ప్రతి రోజూ ఎందరో నటులు, అప్పుడప్పుడు నటీమణులు కూడా డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసుల్లో దొరుకుతుంటారు.పోలీసుల పరీక్షల్లో వారు మద్యం తాగి ఉన్నారని తేలుతుంది.

పోలీసుల తనిఖీల్లో పెద్ద హీరోలు కూడా పట్టుబడ్డారు.అయితే వీరు సినిమా వ్యక్తులు కావడంతో హెచ్చరించి వదిలేస్తున్నారు.

సల్మాన్‌ ఖాన్‌ చేసిన నేరం వంటిది తెలుగు నటులు ఇప్పటివరకు చేయలేదు.నేరం చేయలేదు కాబట్టి తాగి కారు నడిపినా ఏం కాదని అనుకుంటారా? ఇప్పుడు సల్మాన్‌ను చూసైనా జాగ్రత్తగా ఉండటం అవసరం.మరి ఇకనైనా మేల్కొంటారా?

.

తాజా వార్తలు