సల్మాన్ ఖాన్ మాజీ గర్ల్ ఫ్రెండ్ కు చంపేస్తాం అంటూ బెదిరింపులు.. కారణం ఏమిటంటే?

1989లో సల్మాన్ ‘మైనే ప్యార్ కియా’ సినిమా చూసి అమెరికా నుంచీ ముంబైకి వచ్చేసింది 16 ఏళ్ల సోమీ అలీ.ఈమె ముంబై కి వచ్చి రాగానే కండల వీరుడు సల్మాన్ ఖాన్ మనసు దోచేసిన ఈమె సల్మాన్ ఖాన్ ప్రేమలో పడిన సోమీ అలీ సుమారు పది సంవత్సరాల పాటు సల్మాన్ ఖాన్ తో తన ప్రేమ ప్రయాణాన్ని కొనసాగించింది.10 సంవత్సరాల తర్వాత అతనితో బ్రేక్ అప్ చెప్పుకొని ఈ ముద్దుగుమ్మ తిరిగి అమెరికా వెళ్లి స్థిరపడింది.ఇలా అమెరికా వెళ్ళి స్థిరపడిన సోమీ అలీ అక్కడ ఆమె చేసే పనులను తెలిస్తే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోవాల్సిందే.

 Salman Khan Ex Girlfriend Has Threatens To Kill What Is The Reason, Salman Khan,-TeluguStop.com

ఇలా అమెరికాలో స్థిరపడిన మాజీ సినీ హీరోయిన్ ఓ ఎన్‌జీవో స్థాపించి హ్యూమన్ ట్రాఫికింగ్‌కి గురయ్యే బాధితుల్ని ఎన్నో వ్యయప్రయాసలు, ప్రమాదాలకు ఓర్చి అందరిని కాపాడుతూ ఉంటుంది.

ఇలా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తనకు తన స్వదేశమైన పాకిస్తాన్ నుంచి చాలా ప్రాణభయం ఉందని పాకిస్థాన్ కి చెందిన కొందరు తను పాకిస్థాన్లో అడుగుపెడితే చంపేస్తామని బెదిరిస్తూ తనకు మెయిల్ చేస్తున్నారని ఈ సందర్భంగా సోమీ అలీ తనకు ఎదురయ్యే హెచ్చరికలు, తన ప్రాణ గండం గురించి ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టారు.

ఇలా స్వంత దేశ వారి నుంచి తనకు ఈ విధమైనటువంటి బెదిరింపులు రావడానికి గల కారణం ఈమె చేస్తున్న సేవలే అని చెప్పవచ్చు.నో మోర్ టియర్స్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా ఈమె అక్రమ రవాణా బాధితుల్ని కాపాడుతూ ఉంటుంది.

ముఖ్యంగా, గే విక్టిమ్స్‌కి సోమీ అలీ చట్టపరమైన రక్షణ కల్పించటంలో ముందుంటుంది.అదే చాలా మంది కోపానికి గురైన ఈమె చాలా సంవత్సరాల నుంచి తన స్వంత దేశమైన పాకిస్థాన్ కు వెళ్లకుండా అమెరికాలో స్థిరపడి ఈ విధమైనటువంటి సేవలు చేస్తుంది ఈ క్రమంలోనే ఎంతోమంది పాకిస్థాన్ కి చెందిన కొందరు ఎప్పుడైనా తన దేశంలోకి పెడితే వెంటనే చంపుతామని బెదిరిస్తున్నారని పేర్కొన్నారు.

ఇలా తన సొంత దేశంలో తనకు ప్రాణగండం ఉండటం వల్ల తన దేశానికి కొన్ని సంవత్సరాల నుంచి దూరంగా ఉంటున్నానని తెలిపారు.

Telugu Friend, Salman Khan, Salmankhan, Somy Ali, Threat-Movie

ఇక ఈ ఇంటర్వ్యూలో సోమీ అలీ మాట్లాడుతూ పది సంవత్సరాలపాటు ఇండియాలో సల్మాన్ ఖాన్ తో ప్రేమ ప్రయాణం అనంతరం తన ప్రేమకు బ్రేకప్ చెప్పుకుని తిరిగే అమెరికా వెళ్ళిన సంగతి మనకు తెలిసిందే.ఇలా తను ఇండియా వదిలి అమెరికా వెళ్లినప్పటికీ ఆమెకు ఇండియా అంటేనే ఇష్టమని ఇండియా తరువాతే పాకిస్తాన్ అంటే ఇష్టమని తెలియజేసింది.ఇకపోతే సల్మాన్ ఖాన్ నుంచి బ్రేకప్ చెప్పిన తర్వాత ఇప్పటి వరకు ఈ ముద్దుగుమ్మ మరి ఎవరితో డేటింగ్ లో లేకుండా… ఒంటరిగా ఉంటూ సమాజ సేవలో లీనమైపోయింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube