చేతిలో ఒక్క సినిమా లేదు.. అప్పటి రోజులు గుర్తు చేసుకొని కన్నీళ్లు పెట్టిన సల్మాన్ ఖాన్!

కొన్ని కొన్ని సార్లు ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీలు కెరీర్ మొదట్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు.అయినా కూడా వెనుకడుగు వేయకుండా ఎంతో సహనంతో ముందుకు కదులుతారు.

 Salman Khan Emotional He Recalls Had No Work After Maine Pyar Kiya , Salman Khan-TeluguStop.com

అలా కొందరు మంచి సక్సెస్ లు అందుకుంటే.మరికొందరు ఫెయిల్యూర్ కూడా ఎదుర్కొన్నారు.

అయినా కూడా ఒకింత సహనానికి కూడా కోల్పోకుండా చివరి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు.

కెరీర్ మొదట్లో మంచి సక్సెస్ లు అందుకున్న తర్వాత కూడా కొన్ని కొన్ని సార్లు ఇబ్బందులు ఎదుర్కొంటారు.

అవకాశాలు కోల్పోయి చివరికి చేతిలో ఒక్క పైసా కూడా మిగలకుండా వచ్చిన పరిస్థితులు కూడా ఉన్నాయి.ఇప్పటికీ ఇటువంటి పరిస్థితి తెచ్చుకున్న నటీనటులు ఉండగా ఈ విషయాలు చెప్పుకోడానికి ఇబ్బంది పడకుండా నేరుగా చెప్పే వాళ్ళు.

తాజాగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా తాను గతంలో ఎదుర్కొన్న కొన్ని సంఘటనల గురించి పంచుకున్నాడు.

బాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యాచులర్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి అందరికీ తెలిసిందే.

తన నట‌నతో బాలీవుడ్ లో అగ్ర హీరో గా‌‌ నిలిచాడు.ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హోదాను సంపాదించుకున్నాడు.

ఈయనకు బాలీవుడ్ ప్రేక్షకులే కాకుండా టాలీవుడ్ ప్రేక్షకుల నుండి కూడా మంచి అభిమానం ఉంది.ఇప్పటి వరకు పెళ్ళి గురించి మాట తీయని సల్మాన్ బ్యాచిలర్ గానే ఉన్నాడు.

ఐదు పదుల వయసులో కూడా తన వయసును కనిపించకుండా కాపాడుకుంటున్నాడు సల్మాన్ ఖాన్.

Telugu Bhagyashree, Bollywood, Failure, Indianacademy, Pyar Kiya, Bachelor, Salm

ఇక ప్రస్తుతం ఈయన బాలీవుడ్ ప్రాజెక్టులతో పాటు టాలీవుడ్ ప్రాజెక్టులలో కూడా బిజీగా ఉన్నాడు.ఇదిలా ఉంటే తాజాగా ఈయన ఇండియన్ ఫిలిం అకాడమీ అవార్డ్స్ వేడుకల్లో పాల్గొని తన గురించి కొన్ని విషయాలు బయట పెట్టాడు.అంతేకాకుండా ఎమోషనల్ కూడా అయ్యాడు.1989లోతాను నటించిన మైనే ప్యార్ కియా సినిమా విడుదల అయిందని అన్నాడు.

ఈ సినిమా తర్వాత భాగ్యశ్రీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పి పెళ్లి చేసుకొని సెటిలై పోదాం అని ఫిక్స్ అయిందని అన్నాడు.

దీంతో ఆ సినిమా క్రెడిట్ అంతా భాగ్యశ్రీ ఖాతాలో పడిందని.ఆ సినిమా విడుదల తర్వాత ఆరునెలల పాటు తనకు ఒక్క ప్రాజెక్టు లో కూడా అవకాశం రాలేదని అన్నాడు.

ఆ సమయంలో రమేష్ తౌరాని తన జీవితంలో ఒక దేవుడిగా అడుగుపెట్టాడు అని.సల్మాన్ తండ్రి 2000 రూపాయలు ఇచ్చి అతడితో సినిమా తీస్తున్నట్లు నిర్మాత జీపీ సిప్పితో ఒక ఫేక్ ప్రకటన వేయించాడట.

Telugu Bhagyashree, Bollywood, Failure, Indianacademy, Pyar Kiya, Bachelor, Salm

నిజంగా సినిమా తీశామా అంటే.లేదు అని ఆ తర్వాత రమేష్ ఒకసారి ఆ నిర్మాత ఆఫీస్ కి వెళ్లి కొత్త సినిమా మ్యూజిక్ రూ.5 లక్షలు ఇచ్చాడని.అలా తనకు పత్తర్ కే ఫూల్ సినిమా అవకాశం వచ్చిందని అన్నాడు.

తర్వాత తనకు బోనికపూర్ కూడా సహాయం చేశాడు అని తెలిపాడు.ఓసారి తను ఓ షాప్ లో కొత్త చొక్కాల వైపు అలానే చూస్తూ ఉండటం తో ఆ సమయంలో తన దగ్గర డబ్బులు లేవని.

దాంతో సునీల్ శెట్టి తనని చూసి ఆ షర్ట్, వాలెట్ బహుమతిగా ఇచ్చాడు అని ఎమోషనల్ అయ్యాడు సల్మాన్ ఖాన్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube