శిక్ష సరే....పరిహారం ఏదీ..?

మద్యం మత్తులో డ్రయివింగ్‌ చేసి ఒక వ్యక్తి మృతికి కారకుడైన బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌కు ముంబయి కోర్టు ఐదేళ్ల శిక్ష వేసింది.ఆ వెంటనే ఆయనకు బెయిల్‌ దొరికింది.

 Salman Khan Didnt Gave Compensation To Victim’s Family-TeluguStop.com

తీర్పును సవాలు చేస్తూ హైకోర్టుకూ వెళ్లే అవకాశం ఉంది.శిక్ష పడగానే ఆయన జైల్లో చిప్పకూడు తింటాడని అనుకోనక్కర్లేదు.

సల్మాన్‌కు పదమూడేళ్ల తరువాతైనా శిక్ష పడినందుకు మృతుడి కుటుంబం ఆనందంగా పండుగ చేసుకుంటోందని అనుకుంటున్నారా? ఆ ధ్యాస కూడా ఆ కుటుంబానికి లేదు.అదో నిరుపేద కుటుంబం.

అంతో ఇంతో సంపాదించే ఒక్క వ్యక్తీ చనిపోయాడు.దీంతో గత పదమూడేళ్లుగా ఆ కుటుంబం నానా కష్టాలు పడుతోంది.

తిండి కోసం, పిల్లగాళ్ల చదువు కోసం ఆ కుటుంబం పోరాటం చేస్తోంది.వాళ్లకు ఇప్పటివరకూ ఎటువంటి నష్టపరిహారమూ ఇవ్వలేదు.

సల్మాన్‌ఖాన్‌ అనేక దానధర్మాలు చేస్తున్నాడని, సమాజ సేవ చేస్తున్నాడని మీడియాలో కథనాలు వచ్చాయి.ఆయన సేవా కార్యక్రమాలు చూసైనా శిక్ష రద్దు చేయాలని కొందరు కోరుతున్నారు.

మరి ఇదే సల్మాన్‌ ఖాన్‌ ఆ కుటుంబాన్ని ఇప్పటివరకు ఎందుకు ఆదుకోలేదు? తన వల్లనే కదా ఆ కుటుంబం కష్టాల్లో ఉంది? ‘మాకు సాయం కావాలి.నా కుమారుడికి ఓ ఉద్యోగం కావాలి’ అని మీడియా వద్ద మొర పెట్టుకుంది మృతుడు నూరుల్లా భార్య.

ఇదీ మన ప్రభుత్వాల తీరు.కింది కోర్టులోనే పదమూడేళ్లు విచారణ జరిగితే హైకోర్టులో ఎన్నాళ్లు పడుతుందో….!

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube