బిగ్ బాస్ సీజన్ 3 కోసం భారీగా డిమాండ్ చేసిన సల్మాన్ ఖాన్  

Salman Khan Demand Huge Remuneration For Big Boss Session 13 -

బిగ్ బాస్ రియాలిటీ షో ఎంత సూపర్ హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.సల్మాన్ ఖాన్ వ్యాఖ్యతగా చేసిన బిగ్ బాస్ హిందీ రియాలిటీ షో ఇప్పటికి 12 సీజన్స్ పూర్తి చేసుకుంది.

Salman Khan Demand Huge Remuneration For Big Boss Session 13

ఎంతో మంది సెలబ్రిటీలు ఈ హిందీ బిగ్ బాస్ ద్వారా తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్నారు.హిందీ బిగ్ బాస్ సక్సెస్ తో ప్రాంతీయ భాషలలో కూడా దీనిని టెలివిజన్ ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు.

ఇక బిగ్ బాస్ షో ప్రసారం అవుతున్న అన్ని భాషలలో కూడా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది.తెలుగులో బిగ్ బాస్ సీజన్ 3 కి రంగం సిద్ధం అవుతుంది.

ఇక త్వరలో హిందీ బిగ్ బాస్ సీజన్ 13 మొదలు కాబోతుంది.

ఇదిలా ఉంటే ఈ సారి సీజన్ కోసం బాలీవుడ్ కండల హీరో బిగ్ బాస్ నిర్వాహకుల నుంచి భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది.

ఏకంగా 403 కోట్లు ఇస్తేనే చేస్తానని అడిగినట్లు బీటౌన్ లో వినిపిస్తుంది.ఈ షోలో మొత్తం 26 ఎపిసోడ్లు ఉండగా ఒక్కో ఎపిసోడ్‌కు సల్మాన్‌ 31 కోట్లు అడిగినట్లు టాక్ వినిపిస్తుంది.

అయితే హిందీ బిగ్ బాస్ షోకి ఉన్న ఆదరణ దృష్ట్యా సల్మాన్ అడిగినంత పారితోషికాన్ని ఇచ్చేందుకు నిర్వాహకులు ఒప్పుకొన్నారని తెలుస్తుంది.ఇదే నిజమైతే ఓ టీవీ షో కోసం అత్యధిక మొత్తంలో నగదు తీసుకున్న ఇండియన్ సెలబ్రిటీగా సల్మాన్‌ ఖాన్ రికార్డ్ సృష్టించడం గారంటీ అనే మాట వినిపిస్తుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Salman Khan Demand Huge Remuneration For Big Boss Session 13- Related....