కత్రినా కైఫ్ పెళ్లిపై సల్మాన్ ఖాన్ షాకింగ్ రియాక్షన్.. శుభాకాంక్షలు అంటూ?

బాలీవుడ్ కండల వీరుడు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.బాలీవుడ్ లో స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సల్మాన్ ఖాన్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా ఉన్నాడు.

 Salman Khan Congratulates Katrina Kaif Her Wedding Salman Khan,  Katrina Kaif,-TeluguStop.com

టైగర్ 3, పవనపుత్ర భాయిజాన్, దబాంగ్ 4, నో ఎంట్రీ 2 సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నాడు.సల్మాన్ ఖాన్ నటించిన ఈ సినిమాలో కొన్ని సినిమాలు షూటింగ్ జరుపుకుంటుండగా మరికొన్ని సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

బాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా గుర్తింపు తెచ్చుకున్న సల్మాన్ ఖాన్ ఇటీవలే 56 వ పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న సంగతి మనకు తెలిసిందే.

ఇక తమ అభిమాన హీరో ఒక ఇంటివాడు అయితే చూడాలని ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే బాలీవుడ్ లో పలువురు హీరోయిన్ లతో సల్మాన్ ఖాన్ రిలేషన్ షిప్ లో ఉన్నాడు అంటూ ఇప్పటికే ఎన్నోసార్లు ఎన్నో రకాల వార్తలు వినిపించాయి.ఈ విషయాలపై ఎప్పుడూ సల్మాన్ ఖాన్ స్పందించలేదు.

ఇదిలా ఉంటే తాజాగా తన రిలేషన్ షిప్ స్టేటస్ గురించి స్పందించాడు సల్మాన్ ఖాన్.ఈ క్రమంలోనే తన స్నేహితురాలు కత్రినా కైఫ్ వివాహం గురించి కూడా పలు విషయాలు వెల్లడించారు.

ఇటీవల హిందీ బిగ్ బాస్ సీజన్ 5 ఫినాలే లో ఒక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది.

గ్రాండ్ ఫినాలే కు పలువురు సెలబ్రిటీలు వచ్చి బిగ్ బాస్ స్టేజ్ పై సందడే సందడి చేశారు.ఈ క్రమంలోనే కత్రినా కైఫ్ చిందులు వేసిన చికినీ చమేలి పాటకు మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అయిన రాఖీ సావంత్, రుబీనా దిలాయక్ వేశారు.అనంతరం కంగ్రాట్స్ కత్రినా.మన జీవితం సంతోషంగా ఉండాలి అని కోరుకుంటున్నాను.మీ వివాహం తో అందరూ సంతోషిస్తున్నారు.అంటూ కెమెరా వైపు చూసి.అనంతరం కత్రినా కైఫ్ విషయంపై షెహనాజ్ గిల్ సరదాగా సల్మాన్ ఖాన్ ను టిజ్ చేసింది.

కత్రినా పెళ్లి విషయంలో మీరు కూడా సంతోషంగా ఉన్నారా? అయినా మీరు సింగిల్ గా ఉంటేనే బాగుంటారు అని అనగా.అవును నేను సింగిల్ గా అయినప్పుడే మరింత మెరుగ్గా కనిపిస్తాను అని సల్మాన్ ఖాన్ సమాధానమిచ్చాడు.

ఆ మాటకు వెంటనే స్పందించిన షెహనాజ్ అంటే ఇప్పుడు మీరు కమిటెడ్ ఆ? అని ప్రశ్నించగా సల్మాన్ ఖాన్ సమాధానం ఇవ్వకుండా నవ్వేశాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube