సినిమా మార్కెట్ విస్తరించిన తర్వాత స్టార్ హీరోల రెమ్యునరేషన్ ఆకాశాన్ని తాకుతున్నాయి.హీరోయిన్స్ రెమ్యునరేషన్ తో పోల్చుకుంటే పది రెట్లు ఎక్కువగా హీరోల రెమ్యునరేషన్ లు ఉన్నాయి.
ఇండియన్ సినిమాలు చాలా వరకు హీరో బేస్ చేసుకొని నడుస్తూ ఉంటాయి.అలాగే సినిమాలకి మార్కెట్ కూడా హీరోల బట్టి వస్తుంది.
దీనిని దృష్టిలో పెట్టుకొని వారికి నిర్మాతలు అంత భారీ రెమ్యునరేషన్ చెల్లిస్తున్నారు.సౌత్ లోనే ప్రభాస్, మహేష్, పవన్ లాంటి హీరోలు 50 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటే బాలీవుడ్ లో స్టార్ హీరోలుగా ఉన్న సల్మాన్, అమీర్ ఖాన్, షారుఖ్, అక్షయ్ ఎంత డిమాండ్ చేయాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఇక స్టార్ హీరోలు కార్పోరేట్ సంస్థలతో బ్రాండ్ ప్రమోషన్స్ లో కూడా రెమ్యునరేషన్లతో అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు.ఒక ప్రోడక్ట్ ని ప్రమోట్ చేయడానికి భారీగా డిమాండ్ చేస్తున్నారు.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తాజాగా ఒక భారీ డీల్ ను కుదర్చుకున్నట్టుగా తెలుస్తుంది.స్మార్ట్ ఫోన్ కంపెనీతో ఎండోర్స్ మెంట్ డీల్ కోసం ఏకంగా ఏకంగా ఏడు కోట్ల రూపాయల మొత్తాన్ని ఆ సంస్థ సల్మాన్ కు చెల్లించని తెలుస్తుంది.
ఇది ప్రస్తుతానికి దేశంలో నమోదైన అత్యంత భారీ ఎండోర్స్ మెంట్ డీల్ అని అంటున్నారు.ఈ ప్రమోషన్ యాడ్ కోసం సల్మాన్ ఖాన్ మూడు నుంచి ఐదు రోజుల పాటు సమయం కేటాయించాల్సి ఉంటుందని సమాచారం.
మొత్తానికి కేవలం ఐదు రోజుల షూటింగ్ కోసం సల్మాన్ ఖాన్ బ్రాండ్ ఇమేజ్ కోసం ఏకంగా ఆ సంస్థ ఏడు కోట్లు చెల్లించడం చూస్తుంటే కార్పోరేట్ వ్యాపారులకి ఈ బ్రాండ్ ప్రమోషన్ ద్వారా ఎంత ఆదాయం వస్తుందో అంచనా వేసుకోవచ్చు.