బేవకూఫ్ పనులు మానెయ్యాలంటూ హీరోయిన్ కు సల్మాన్ ఖాన్ వార్నింగ్?

Salman Khan Called Jacqueline Bewakoof For Doing Cardio On Treadmill

బాలీవుడ్ స్టార్ హీరో, కండల వీరుడు సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఇతన్ని అభిమానులు ముద్దుగా కండలవీరుడు అని కూడా పిలుస్తూ ఉంటారు.

 Salman Khan Called Jacqueline Bewakoof For Doing Cardio On Treadmill-TeluguStop.com

సల్మాన్ ఖాన్ సినిమాల్లో తనదైన శైలిలో నటించి తన డాన్స్ తో, నటనతో బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంది ప్రేక్షకుల మనసులలో స్థానం సంపాదించుకున్నారు.బాలీవుడ్ లో అయితే సల్మాన్ ఖాన్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

సల్మాన్ ఖాన్ జాక్వలిన్ ఫెర్నాండేజ్ తో సహా ఎంతోమంది బీటౌన్ యాక్టర్స్ కెరీర్ ను చక్కదిద్దడంలో హెల్ప్ చేశారు.జాక్వెలిన్ కిక్ సినిమాల్లో కలిసి నటించగా.అప్పుడు వీరి స్నేహం మొదలైంది.ఇక అప్పటి నుంచి వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ గా కొనసాగుతూ ఉన్నారు.

 Salman Khan Called Jacqueline Bewakoof For Doing Cardio On Treadmill-బేవకూఫ్ పనులు మానెయ్యాలంటూ హీరోయిన్ కు సల్మాన్ ఖాన్ వార్నింగ్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇదిలా ఉంటే తాజాగా అంతిమ్ మూవీ ప్రమోషన్స్ కోసం కపిల్ శర్మ షోకి హాజరయ్యారు.ఈ క్రమంలోనే ఈ షోలో సందడి సందడి చేశారు.

Telugu Bewakoof Works, Bollywood, Jacqueline, Salman Khan-Movie

ఈ సందర్భంగా ఇంట్రెస్టింగ్ మేటర్ రివిల్ చేసిన సల్మాన్ ఖాన్ ఫిట్నెస్ కోసం పన్వేల్ లోని తన ఫామ్ హౌస్ లో వ్యవసాయం చేయమని జాక్వెలిన్ కు సూచించినట్లు తెలిపారు.గత ఏడాది లాక్ డౌన్ సమయంలో సల్మాన్ ఖాన్ తన ఫ్రెండ్స్ తో కలిసి అక్కడికి వెళ్లి స్పెండ్ చేసారట.వారిలో జాక్వెలిన్ కూడా ఉందట.ఆ టైంలో ప్రతిరోజు ట్రెడ్ మిల్ పరిగెత్తేదని, అయితే అలాంటి బేకూప్, ఫూలిష్ పనులకు బదులు వ్యవసాయం చేస్తే బెటర్ అని తనకు చెప్పినట్టు గుర్తు చేశాడు సల్మాన్ ఖాన్.

అలా రోజంతా పని చేస్తే ఆరోగ్యంతో పాటు పంటలు కూడా పండించినట్లు అవుతుందనే అలా చెప్పాను అని తెలిపాడు.

#Salman Khan #Bewakoof Works #Jacqueline

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube