అసిన్ కు పెద్ద ఇల్లు కట్టించిన సల్మాన్ ఖాన్.. సోషల్ మీడియాలో జోరు ప్రచారం.. ఆ తర్వాత?

Salman Khan Builds A Big House For Asin Rumours On Social Media

సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటుల మధ్య గాసిప్స్ రావడం కొత్తేమి కాదు.ఎందుకంటే ఇవి కూడా సినిమాలు పుట్టినప్పుడే పుట్టాయని చెప్పవచ్చు.

 Salman Khan Builds A Big House For Asin Rumours On Social Media-TeluguStop.com

ఎప్పటి నుంచో నటీనటుల మధ్య ప్రేమాయణం ఉందని, డేటింగ్ నడుస్తుందని, పెళ్లి చేసుకున్నారని ఇలా ఎన్నో రకాలుగా పుకార్లు వినిపించాయి.

కానీ నటీనటులు వెంటనే ఈ పుకార్లకు స్పందించే వాళ్ళు.

 Salman Khan Builds A Big House For Asin Rumours On Social Media-అసిన్ కు పెద్ద ఇల్లు కట్టించిన సల్మాన్ ఖాన్.. సోషల్ మీడియాలో జోరు ప్రచారం.. ఆ తర్వాత-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇవన్నీ తప్పుడు ప్రచారాలు అంటూ అటువంటి విషయాలలో మాకు సంబంధాలు లేవు అంటూ మీడియా ముందుకు వచ్చి తెలిపేవారు.అలా ఓసారి అసిన్ కూడా ఇటువంటి పుకార్లే ఎదుర్కొంది.

ఇంతకు అసలేం జరిగిందో తెలుసుకుందాం.

భారతీయ సినీ నటి అసిన్. ఈమె తన నటనతో మంచి పేరు సంపాదించుకుంది.ఇండస్ట్రీకి పరిచయమైన అతి తక్కువ సమయంలో మంచి హోదాను అందుకుంది.కెరీర్ మొదట్లో మోడల్ గా బాధ్యతలు చేపట్టింది.అంతేకాకుండా భరతనాట్యంలో కూడా శిక్షణ పొంది మంచి నర్తకిగా గుర్తింపు తెచ్చుకుంది.

Telugu Ajay Devgan, Asin, Bollywood, Rumors, Salman Khan, Vipul Sha-Movie

ఇక ఈమె తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషలలో కూడా నటించింది.ఈమెకు మరో టాలెంట్ ఉంది.అదేంటంటే ఈమె దాదాపు ఎనిమిది భాషలలో మాట్లాడగలదు.తన సినిమాలకు తానే డబ్బింగ్ చెప్పుకోగల శక్తి తనలో ఉంది.ఇక తన నటనకు పలు అవార్డులు కూడా అందుకుంది.

ఈమె తొలిసారిగా మలయాళం సినిమా ద్వారా 2001లో సినీ ఇండస్ట్రీకి అడుగుపెట్టింది.

ఇక 2003లో అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి సినిమాతో తెలుగు సినీ ప్రేక్షకుకు పరిచయమైంది.ఈ సినిమా తనకు మంచి సక్సెస్ ను అందించింది.

ఆ తరువాత ఎన్నో సినిమాలలో అవకాశాలు అందుకుంది.

Telugu Ajay Devgan, Asin, Bollywood, Rumors, Salman Khan, Vipul Sha-Movie

చాలా వరకు టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలలో నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది.ఇక బాలీవుడ్ లో కూడా చాలావరకు స్టార్ హీరోల సినిమాలలో నటించింది.ఇదిలా ఉంటే అసిన్ గతంలో చాలా పుకార్లు ఎదుర్కొంది.

అది కూడా బాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఎదుర్కొంది.

తాను అభిషేక్ బచ్చన్, సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరోల సరసన సినిమాలు చేస్తున్న సమయంలో.

తనకు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇల్లు కట్టించాడన్న వార్తలు బాగా వినిపించాయి.దీంతో గతంలోనే తాను వెంటనే ఆ విషయం గురించి స్పందించింది.

Telugu Ajay Devgan, Asin, Bollywood, Rumors, Salman Khan, Vipul Sha-Movie

తాను షూటింగ్ లో ఉండగా ఈ పుకారు వినిపించిందని తెలిపింది.అదే సమయంలో సల్మాన్ ఖాన్ తన దగ్గరికి వచ్చి ‘ఎలా ఉంది నీ కొత్త ఇల్లు అని’.సరదాగా అడగటంతో అక్కడే ఉన్న అజయ్ దేవ్ గన్,  విపుల్ షా లు బాగా నవ్వుకున్నారట.ఆ తర్వాత అందరూ ఈ విషయాన్ని నిజమే అనుకున్నారట.

ఇక పలు వెబ్ సైట్ లలో, మీడియా లలో కూడా ఈ పుకారును వైరల్ చేశారని పైగా తనకు అతనితో పెళ్లి కూడా జరిగిందని వార్తలు వచ్చాయని తెలిపింది.ఆ తర్వాత తమ మధ్య ఎటువంటి సంబంధం లేదని కేవలం స్నేహితులమని చెప్పుకొచ్చింది.

ఆ తర్వాత కొంతకాలానికి ఈ విషయం గురించి మళ్లీ ఎవరు తీయలేదు.

#Vipul #Salman Khan #Rumors #Salman Khan #Salman Khan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube