కత్రినా పెళ్లి రోజు సల్మాన్ ఖాన్ బాడీ గార్డ్ ఉండడా.. కారణం అదేనా?

Salman Khan Bodyguard Will Attend Katrina Wedding

బాలీవుడ్ ప్రేమ జంట విక్కీ కౌశల్, కత్రినాకైఫ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈ జంట గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారన్న విషయం అందరికి తెలిసిందే.

 Salman Khan Bodyguard Will Attend Katrina Wedding-TeluguStop.com

డిసెంబర్ 9న ఈ జంట పెళ్లి పీటలు ఎక్కబోతోంది.రాజస్థాన్ సవాయి మదోపూర్ లోని సిక్స్ సెన్సెస్ ప్రిన్సెస్ పోర్ట్ బర్వారా లో వీరి వెడ్డింగ్ జరగనుంది.

అందుకోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.అయితే ఈ ప్రేమ జంట అతి కొద్దిమంది స్నేహితులు సన్నిహితుల సమక్షంలో మాత్రమే పెళ్లి చేసుకోనున్నట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా వచ్చే అతిథులకు కూడా పలురకాల కండిషన్ లు కూడా పెట్టినట్టు తెలుస్తోంది.విక్కీ, కత్రినా పెళ్లికి సల్మాన్ ఖాన్, అతని కుటుంబ సభ్యులకు వెడ్డింగ్ అందలేదని బాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

సల్మాన్ ఖాన్ ఈ వెడ్డింగ్ కు వెళ్లే అవకాశం ఉందా లేదా అనే విషయం గురించి క్లారిటీ లేకున్న.సల్మాన్ ఖాన్ బాడీగార్డ్ షేరా మాత్రం తప్పకుండా ఈ పెళ్లి వేడుకల్లో ఉండబోతున్నాడట.

అదేంటి అనుకుంటున్నారా.

Telugu Bollywood, Katrina Kaif, Salman Khan, Shera, Vicky Kaushal-Movie

కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లి వేడుకకు సెక్యూరిటీ ఏర్పాట్లను సల్మాన్ ఖాన్ బాడీ గార్డ్ షేరా దగ్గర ఉండి చూసుకోబోతున్నాడట.టైగర్ సెక్యూరిటీ పేరుతో కంపెనీ నడుపుతున్న షేరా పార్టీ మెంబర్స్ తో కలిసి కత్రినా, విక్కి పెళ్లికి ఛార్జ్ తీసుకోనున్నాడు అంటూ బాలీవుడ్ సినీ ఇండస్ట్రీ లో వార్తలు వినిపిస్తున్నాయి.మొత్తానికి సల్మాన్ ఖాన్పెళ్లికి రాకపోయినా, అతని బాడీ గార్డ్ రావడం మాత్రం పక్కా అని తెలిసిపోతుంది.

#Vicky Kaushal #Shera #Katrina Kaif #Salman Khan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube