పాము కాటుతో ఆసుపత్రిలో అడ్మిట్ అయిన సల్మాన్.. ఫ్యాన్స్ ఆందోళన!

బాలీవుడ్ బడా హీరో సల్మాన్ ఖాన్ పాము కాటుకు గురి అయినట్టు తెలుస్తుంది.ఈ రోజు తెల్లవారు జామున సల్మాన్ ఖాన్ పాము కాటుకు గురి అయ్యాడట.

 Salman Khan Bitten By A Non- Venomous Snake At His Panvel Farmhouse Details, Big-TeluguStop.com

ఈ విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.సల్మాన్ ఖాన్ గురించి ప్రపంచ వ్యాప్తంగా తెలుసు.

ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు.

అయితే తాజాగా సల్మాన్ ఖాన్ పాము కాటుకు గురి అయ్యాడు.

ఆయన ఫామ్ హౌస్ అయిన పన్వెల్ లో విషం లేని పాము కాటుకు సల్మాన్ ఖాన్ గురి అయ్యాడట.వెంటనే ఆయనను చికిత్స కోసం కమోతే లోని ఎంజీఎం హాస్పిటల్ కు తీసుకు వెళ్లారట.

వైద్యులు వెంటనే అప్రమత్తం అయ్యి సల్మాన్ ఖాన్ ను పరీక్షించారట.ఆయనను పరీక్షించిన వైద్యులు అతడికి ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారట.

ఈ రోజు ఉదయం 9 గంటలకు సల్మాన్ ఖాన్ ను ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ చేసినట్టు తెలుస్తుంది.సల్మాన్ ఖాన్ కు ఆయన చేతి మీద పాము కాటేసినట్టు సమాచారం.

Telugu Bigg Boss, Snake, Salman Khan, Salmankhan, Salmanpanvel-Movie

ఈ విషయం విన్న అభిమానులు ఆందోళన చెందిన కూడా ఆయనకు ప్రమాదం లేదు అని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు.ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సల్మాన్ ఖాన్ బిగ్ బాస్ 15 కు హోస్ట్ గా చేస్తున్నారు.

Telugu Bigg Boss, Snake, Salman Khan, Salmankhan, Salmanpanvel-Movie

ఈ రోజు బిగ్ బాస్ నుండి స్పెషల్ ఎపిసోడ్ ప్రసారం కానుంది.ఆర్ ఆర్ ఆర్ సినిమా త్వరలోనే రిలీజ్ కానున్న సందర్భంగా ఈ షోకు ఆర్ ఆర్ ఆర్ టీమ్ వెళ్లి సల్మాన్ ఖాన్ తో సందడి చేసారు.వీళ్ళు చేసిన సందడికి సంబంధించిన వీడియోలు ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతున్నాయి.డిసెంబర్ 27న సల్మాన్ ఖాన్ పుట్టిన రోజు సందర్భంగా బిగ్ బాస్ వేదికపైనే ఆర్ ఆర్ ఆర్ టీమ్ తో కలిసి సెలెబ్రేట్ చేసుకున్నారు.

ఆ ఎపిసోడ్ ఈ రోజు టీవీల్లో ప్రసారం కానుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube