స్టైలిష్ స్టార్ పాటకు సూపర్ స్టార్ డ్యాన్స్

టాలీవుడ్‌లో అదిరిపోయే స్టెప్పులేసే హీరోల్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ టాప్ ప్లేస్‌లో ఉంటాడు.బన్నీ యాక్టింగ్‌తో పాటు అదిరిపోయే స్టెప్పులు కూడా వేస్తాడు.

 Salman Khan To Dance For Allu Arjun Song, Salman Khan, Allu Arjun, Radhe, Seetim-TeluguStop.com

దీంతో బన్నీ పాటలకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తుందనే విషయం అందరికీ తెలిసిందే.కాగా ఇటీవల బన్నీ నటించిన సినిమా పాటలకు ఇతర సెలబ్రిటీలు సైతం డ్యాన్స్ చేస్తూ వీడియోలు తీస్తున్నారు.

అయితే తాజాగా బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ బన్నీ పాటకు డ్యాన్స్ వేసేందుకు రెడీ అయ్యాడు.

అయితే ఇదేదో టిక్‌టాక్ వీడియో కోసం కాదని తెలుస్తోంది.

సల్మాన్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాధే’లో ఓ ఫాస్ట్ బీట్ సాంగ్ ఉండబోతుందట.తెలుగులో డీజే – దువ్వాడ జగన్నాథం సినిమాలోని ‘సీటీమార్’ అనే సూపర్ సాంగ్‌ను హిందీలో రీమిక్స్ చేస్తున్నారట చిత్ర యూనిట్.

ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ ప్రభుదేవా డైరెక్ట్ చేస్తుండగా టాలీవుడ్ రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

దీంతో ఈ సినిమాలో సీటీమార్ సాంగ్ రీమిక్స్ ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ పాటకు సల్మాన్ ఖాన్ ఎలాంటి స్టెప్స్ వేస్తాడా అని ఆయన ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.మరి సల్మాన్ ఖాన్ ఈ సినిమాలో తన డ్యాన్స్‌తో నిజంగా సీటీమార్ వేయిస్తాడా అనేది చూడాలి.

కాగా ఈ సినిమాలో దిషా పటానీ హీరోయిన్‌గా నటిస్తోండగా సల్మాన్ తన హోం బ్యానర్‌పై ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube