చిరంజీవి గాడ్ ఫాదర్ షూటింగ్ కు సిద్ధమైన సల్మాన్..!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.రీ ఎంట్రీ తర్వాత నేటి హీరోలకు పోటీగా చిరంజీవి వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఎంతో బిజీ బిజీగా గడుపుతున్నారు.

 Salman Is Ready For Chiranjeevi Godfather Shooting, Salman, Bollywood, God Fathe-TeluguStop.com

ఈ క్రమంలోనే ఈ ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ఆచార్య సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.ఇకపోతే మలయాళంలో ఎదో అద్భుతమైన విజయాన్ని అందుకున్న లూసిఫర్ చిత్రాన్ని తెలుగులో గాడ్ ఫాదర్ చిత్రంగా తెరకెక్కిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ఇక ఈ సినిమాకి మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు.మలయాళంలో ఎంతో సూపర్ హిట్ అందుకున్న ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ ఒక కీలక పాత్రలో నటించారు.

అయితే తెలుగులో ఈ చిత్రంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ పృథ్వీరాజ్ సుకుమారన్ పాత్రలో నటిస్తున్నారు.ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే ముంబైలో షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభించబోతున్నారు.

Telugu Bollywood, Chiranjeevi, God, Salman, Tollywood-Movie

ఈ క్రమంలోనే ఈ షెడ్యూల్ చిత్రీకరణలో భాగంగా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఈ సినిమా షూటింగులో పాల్గొనడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.ఈ క్రమంలోనే కజ్రత్‌లోని ఎన్‌డీ స్టూడియోస్‌లో మార్చి 12 నుంచి వీళ్లిద్దరి మధ్య సన్నివేశాలు తెరకెక్కనున్నాయి.అయితే వీరిద్దరి మధ్య జనవరిలోనే షూటింగ్ పూర్తి కావాల్సి ఉండగా ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవి కరోనా బారినపడటం అలాగే సల్మాన్ ఖాన్ టైగర్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉండటం వల్ల వీరిద్దరి షెడ్యూల్ కుదరకపోవడంతో షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది.త్వరలోనే ఈ ఇద్దరు స్టార్ సెలబ్రిటీలు కూడా కెమెరా ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube