టాలీవుడ్‌ హీరోలపై తేజ సంచలన వ్యాఖ్యలు సల్మాన్‌కు ఉన్నంత నీతి ఇక్కడ ఎవరికి లేదు  

Salman Has No Intention Of Doing Any Good Aspects Of Tollywood-movie Updates,salman,tollywood,సల్మాన్

కోలీవుడ్‌ హీరోలతో పోల్చితే టాలీవుడ్‌ హీరోలు కాస్త బెట్టు ఎక్కువ చేస్తారని, వారు దర్శకులపై పెత్తనం చేసేందుకు ప్రయత్నిస్తారు అంటూ విమర్శలు ఉన్నాయి. దర్శకులకే టాలీవుడ్‌ హీరోలు సూచనలు ఇస్తూ ఉంటారు. అలాంటి సమయంలో దర్శకుల క్రియేటివిటీ దెబ్బతింటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది..

టాలీవుడ్‌ హీరోలపై తేజ సంచలన వ్యాఖ్యలు సల్మాన్‌కు ఉన్నంత నీతి ఇక్కడ ఎవరికి లేదు-Salman Has No Intention Of Doing Any Good Aspects Of Tollywood

ఇక బాలీవుడ్‌ హీరోలు పాటించే విలువలను టాలీవుడ్‌ హీరోలు పాటించరు అంటూ దర్శకుడు తేజ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను చేసిన వ్యాఖ్యలను ఆయన గట్టిగా సమర్ధించుకుంటున్నాడు. తాను అన్న మాటలో ఏమాత్రం తప్పులేదని ఆయన బలంగా చెబుతున్నాడు.

తాజాగా తేజ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాను ఎంతో మందికి కెరీర్‌ ఇచ్చాను, ఎంతో మందిని స్టార్స్‌గా మార్చాను. కాని ఇప్పుడు వారు నన్ను కనీసం పట్టించుకునే పరిస్థితుల్లో కూడా లేరు.

వారు నన్ను సక్సెస్‌ ఉన్నన్ని రోజులు మాత్రమే గౌరవించారు. ఎప్పుడైతే నా నుండి సక్సెస్‌ దూరంగా వెళ్లిందో అప్పుడే వారు కూడా నా నుండి దూరం అయ్యారు. బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌కు శ్రీరాజ్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ ద్వారా బ్రేక్‌ వచ్చింది.

ఆ బ్యానర్‌లో నటించిన సినిమాతో సల్మాన్‌ స్టార్‌ అయ్యాడు. అందుకే ఆ బ్యానర్‌లో ఎప్పుడు నటించమన్నా కూడా సల్మాన్‌ సిద్దంగా ఉంటాడు.

సల్మాన్‌ కొత్త సినిమా ఒప్పందం సమయంలోనే తాను శ్రీరాజ్‌ ప్రొడక్షన్‌ నుండి పిలుపు అందుకుంటే వెంటనే ఆ సినిమాను చేస్తాను అంటూ చెప్పేస్తాడు. అంతటి గౌరవంను శ్రీరాజ్‌ ప్రొడక్షన్‌పై చూపిస్తాడు.

కాని టాలీవుడ్‌ హీరోలకు అలాంటి గౌరవం, అలాంటి నీతి ఉండదు అంటూ తేజ అన్నాడు. ఈ సమయంలోనే మహేష్‌బాబుపై మాత్రం ఆయన పాజిటివ్‌గా స్పందించాడు. దర్శకుడు ఎలా కావాలనుకుంటే అలా చేస్తాడు, దర్శకుడు దూకేయమంటే దూకేసేందుకు రెడీగా మహేష్‌బాబు ఉంటాడని, అందరు కూడా మహేష్‌బాబును చూసి నేర్చుకోవాలంటూ తేజ ఇతర హీరోలకు సలహా ఇచ్చాడు..