చికెన్, లాలీపాప్స్ తింటే లక్షల్లో జీతం.. ఒకసారి ట్రై చేస్తే పోలా..!

మీరు చికెన్ ప్రియులా చికెన్ అంటే లొట్టలేసుకుంటూ తింటారా అయితే మీకు ఒక అదిరిపోయే న్యూస్.చికెన్ లాలీపాప్స్ తింటూనే నెలకు లక్ష రూపాయిల వరకు శాలరీ కూడా పొందవచ్చు తెలుసా.

 Salary In Lakhs For Eating Chicken And Lollipops .. Like Trying Once. Bumper Off-TeluguStop.com

ఒకపక్క ఆకలి తీరిద్ది మరోపక్క మీ జేబులో డబ్బులు కూడా నిండుగా ఉంటాయి.ఏంటి చికెన్ తింటే లక్షల్లో జీతం ఎవరన్నా ఇస్తారా అని షాక్ అవుతున్నారా.? కానీ ఇది నిజంగానే నిజం.అసలు వివరాల్లోకి వెళితే.

యూకేలో ఇలాంటి ఒక ప్రకటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.ఈ ప్రకటన చూసి అందరు ఆశ్చర్య పోతున్నారు.యూకే లోని ఒక ఫుడ్‌ కంపెనీ ఇలాంటి ఆసక్తికరమైన ప్రకటనను చేసింది.అలాగే ఈ ప్రకటనలో చికెన్‌, లాలిపాప్స్‌ తింటే లక్ష రూపాయల జీతం కూడా చెల్లిస్తామని తెలిపింది.

అది ఎలా అనుకుంటున్నారా.? బ్రిటన్‌ కు చెందిన ప్రముఖ ఫిష్‌ ఫింగర్స్‌ కంపెనీ బర్డ్స్‌ ఐ ఇలా తన ఉద్యోగ ప్రకటనతో అందరిని ఆశ్చర్యపరిచింది.ఈ ప్రాంతంలో చికెన్‌ లాలిపాప్స్‌తో పాటు టమోటా సాస్‌ ను కూడా కలిపి తినడాన్ని ప్రజలు చాలా ఇష్టపడతారని ఒక సర్వేలో తేలింది.

Telugu Bumper, Chicken, Lakhs, Lolipop, Latest-Latest News - Telugu

అందుకే ఈ కంపెనీ చికెన్‌, లాలిపాప్స్‌ తినేందుకు ఓ వ్యక్తి కావాలని ఇలా ఉద్యోగ ప్రకటన ఇచ్చింది.ఈ ఉద్యోగం వచ్చిన వ్యక్తి చికెన్‌, లాలిపాప్స్‌ తిని వాటి రుచి ఎలా ఉందో గుర్తించాలి అన్నమాట.ఈ ఉద్యోగానికి ఎంపికైన వ్యక్తికి చీఫ్‌ టెస్టింగ్‌ ఆఫీసర్‌ పోస్టు ఉద్యోగం వస్తుంది.

ఇలా నియమించిన వ్యక్తికి లక్ష రూపాయల జీతం అందిస్తోంది.ఒక నివేదిక ప్రకారం ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థికి ఫుడ్‌ పై పూర్తిగా అవగాహన ఉండి తీరాలి.

అలాగే ఫుడ్ గురించి వారికి తెలిసిన అంశాలను birdseyeHR@chiefdippingofficer.co.uk కు రాసి పంపవచ్చని తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube