సలార్1 మూవీ సక్సెస్ సాధించడంతో ప్రస్తుతం సినీ అభిమానుల దృష్టి సలార్2 సినిమాపై ఉంది.సలార్2 గురించి చిన్న అప్ డేట్ వచ్చినా అభిమానులు క్షణాల్లో వైరల్ చేస్తున్నారు.బాబీ సింహా తాజాగా ఒక ఇంటర్వ్యూలో సలార్2 ( Salar2 )గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.సలార్1 సినిమా క్లైమాక్స్ చివరి 10 నిమిషాలు ప్రేక్షకులకు గూస్ బంప్స్ వచ్చాయని ఆయన కామెంట్లు చేశారు.
సలార్2 సినిమాలో ఆ ఫీల్ 100 రెట్లు ఎక్కువగా ఉంటుందని బాబీ సింహా( Bobby simha ) చెప్పుకొచ్చారు.సలార్2 సినిమాకు ఆశ్చర్యానికి గురి చేసే క్లైమాక్స్ ను సిద్ధం చేశారని ఆయన తెలిపారు.నేను కూడా ప్రశాంత్ నీల్ సలార్2 షూట్ ఎప్పుడు మొదలుపెడతారా అని ఎదురుచూస్తున్నానని బాబీ సింహా పేర్కొన్నారు.సలార్2 మూవీ క్లైమాక్స్ వేరే లెవెల్ లో ఉండబోతుందని బాబీ సింహా కామెంట్ల ద్వారా అర్థమవుతోంది.
ప్రభాస్ ఏప్రిల్ నెల నుంచి ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనౌన్నారని సమాచారం అందుతోంది.ప్రభాస్ ( Prabhas )వరుస సినిమాలతో బిజీగా ఉన్న నేపథ్యంలో సలార్2 మూవీ షూట్ ఎప్పటికి పూర్తవుతుందనే ప్రశ్నకు సంబంధించి జబాబు దొరకాల్సి ఉంది.బాబీ సింహా రోల్ సలార్2 సినిమాలో మరింత కీలకంగా ఉండనుందని తెలుస్తోంది.బాబీ సింహా రోల్ ముగింపు ఏ విధంగా ఉంటుందో చూడాల్సి ఉంది.
సలార్2 సినిమా యాక్షన్ ప్రియులకు ఫుల్ మీల్స్ లా ఉండనుందని సమాచారం అందుతోంది.సలార్ సీక్వెల్ పై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.సలార్2 సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే కాన్సెప్ట్ తో తెరకెక్కుతోందని సమాచారం అందుతోంది.సలార్2 సినిమా బిజినెస్ పరంగా కూడా ఇండస్ట్రీ వర్గాలకు షాకివ్వనుందని తెలుస్తోంది.సలార్2 సినిమా ఇతర భాషల్లో సైతం రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి.