'సలార్' థియేట్రికల్ డీల్ క్లోజ్.. భారీ టార్గెట్ తో బరిలోకి.. మరి జాక్ పాట్ దక్కేనా?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) బాహుబలి తర్వాత వరుస ప్లాప్స్ ఎదుర్కొంటున్న ఈయన మార్కెట్ కానీ క్రేజ్ కానీ కొద్దిగా కూడా తగ్గలేదు సరికదా ఇంకా పెరుగుతూనే పోతుంది.ఈయన క్రేజ్ చూసి రాబోయే సినిమాలకు ఎంత అమౌంట్ అయిన పెట్టడానికి డిస్టిబ్యూషన్ సంస్థలు రెడీగా ఉన్నాయి.

 Salaar Theatrical Deals Sold For Close, Salaar, Salaar Rights, Prabhas, Prashant-TeluguStop.com

రెడీగా ఉండడమే కాదు.ఇప్పుడు ఈయన నటిస్తున్న ఒక సినిమాకు భారీ స్థాయిలో బిజినెస్ జరిగింది.

ఆ సినిమా ఏంటంటే.ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో భారీ క్రేజ్ ఉన్న పాన్ ఇండియన్ మూవీ ”సలార్”( Salaar ). ఈ సినిమాను కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.కెజిఎఫ్ సినిమాతో సంచలన విజయం అందుకున్న నీల్ ( Prashanth Neel ) ఆ తర్వాత వెంటనే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను లైన్లో పెట్టాడు.

ఈ సినిమాను నీల్ హై వోల్టేజ్ యాక్షన్ కథాంశంతో తెరకెక్కిస్తున్నాడు.

Telugu Salaar, Hombale, Prabhas, Prashanth Neel-Movie

వీరి కాంబోలో ఏ రేంజ్ లో యాక్షన్ బ్లాక్ బస్టర్ తెరకెక్కుతుందో అని డార్లింగ్ ఫ్యాన్స్ అంతా ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.ప్రస్తుతం ఫారిన్ కంట్రీస్ లో శరవేగంగా షూటింగ్ జరుపు కుంటున్న ఈ సినిమా అప్పుడే బిజినెస్ ( Salaar Theatrical Deals ) పరంగా కేక పుట్టిస్తుంది.తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఏకంగా 150 కోట్లకి గీత ఆర్ట్స్, ఎస్ వి సి ప్రొడక్షన్ లలో ఒకరు సొంతం చేసుకునేందుకు రెడీగా ఉన్నారని సమాచారం.

Telugu Salaar, Hombale, Prabhas, Prashanth Neel-Movie

ఈ సినిమా యొక్క ఓవర్సీస్ రైట్స్ ని పహర్స్ డిస్టిబ్యూటర్ 65 కోట్లకు సొంతం చేసుకున్నారట.అలాగే తమిళ్ రైట్స్ ను 25 కోట్లకు న్యూ డీలర్ సొంతం చేసుకోగా.కర్ణాటకలో హోంబలే సంస్థ(Hombale ) వారే 50 కోట్ల టార్గెట్ తో రిలీజ్ చేయబోతున్నారట.ఈ సినిమాకు ఇంకా హిందీ తో పాటు మరికొన్ని డీల్స్ మాత్రమే పూర్తి కావాల్సి ఉందట.

మొత్తం మీద ఈ సినిమా 400 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్( Pre Release Business ) జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది.మరి ఈ నిర్మాతలకు జాక్ పాట్ దక్కుతుందో లేదో చూడాలి.

ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్( Shruti Haasan ) హీరోయిన్ గా నటిస్తుండగా.కెజిఎఫ్( KGF ) వంటి సినిమాను నిర్మించిన హోంబలే వారు భారీ స్థాయిలో హాలీవుడ్ రేంజ్ లో సినిమాను నిర్మిస్తున్నారు.

సెప్టెంబర్ 28న రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేసారు.దీంతో ఈ సినిమాను అనుకున్న సమయానికి పూర్తి చేసి ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయడానికి మేకర్స్ సిద్ధం అవుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube