సలార్ షూటింగ్ వీడియో లీక్.. ప్రభాస్ లుక్ చూస్తే ఫిదా కావాల్సిందే!

ప్రస్తుతం సోషల్ మీడియా వాడుక ఎక్కువగా ఉన్నందున.దీనిపై ప్రభావం కూడా అంతే ఎక్కువగా ఉంది.

 Salaar Shooting Video Leaked Prabhas In Amazing Look Details, Salar ,shooting Vi-TeluguStop.com

ప్రతి ఒక్క విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకోగా.టీవీ లో కంటే ముందు సోషల్ మీడియాలోనే ప్రసారమవుతున్నాయి.

ఇక సమాచారం తెలిసిన వెంటనే సోషల్ మీడియా ద్వారా బయటపడటమే కాకుండా.వెంటనే కొన్ని నిమిషాల పరిధిలోని షేరింగ్ అవుతుంటాయి.

ఇక్కడి వరకు బాగానే ఉంటే.సినిమావాళ్ళకు మాత్రం సోషల్ మీడియా పెద్ద తలనొప్పిగా మారింది.సినిమాల విషయంలో దర్శక నిర్మాతలు సినిమాకు సంబంధించిన విషయము గాని, కథ గాని, హీరో పాత్ర గాని తాము విడుదల చేసే వరకు బయట ఎక్కడా లీక్ కాకుండా జాగ్రత్త పడుతుంటారు.అంతేకాకుండా నటించే నటుల విషయాలను కూడా బయట పెట్టకుండా జాగ్రత్త పడుతున్న సమయంలోనే సోషల్ మీడియా ద్వారా బయటపడుతున్నాయి.

ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోల సినిమా వీడియోలు లీక్ అవ్వగా చాలామంది దర్శక నిర్మాతలు సీరియస్ అయ్యారు.అయినా కూడా లీక్ ల బెడద మాత్రం తప్పట్లేదు.

ఇదిలా ఉంటే తాజాగా ప్రభాస్ కి సంబంధించిన ఓ సినిమా వీడియో లీక్ అవ్వగా ప్రస్తుతం అది బాగా వైరల్ అవుతుంది.ఇంతకూ అసలు విషయం ఏంటంటే.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత ఆయన క్రేజ్ మొత్తం మారిపోయింది.

ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకోవడంతో ఆ తర్వాత కూడా పాన్ ఇండియా సినిమాలకు అలవాటు పడ్డాడు.దాంతో సాహో, రాధేశ్యామ్ సినిమాలతో ముందుకు రాగా ఈ సినిమాలు సక్సెస్ కాలేకపోయాయి.ఇక ప్రస్తుతం ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఆదిపురుష్ 3D సినిమాలో బిజీగా ఉన్నాడు.

అంతే కాకుండా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమాలో నటిస్తున్నాడు.

వీటితో పాటు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో, దీపికా పదుకొణెతో కలిసి ప్రాజెక్ట్- K సినిమాలో నటిస్తున్నాడు.తరువాత మారుతి దర్శకత్వంలో రాజా డీలక్స్, సందీప్ వంగతో కలిసి స్పిరిట్ సినిమాల్లో నటించనున్నాడు.ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా సలార్ సినిమాకు సంబంధించిన షూటింగ్ వీడియో లీక్ అయింది.

ఎవరో ఒక నెటిజన్.ప్రభాస్ షూటింగ్ స్పాట్ లో ఉండగా వెంటనే దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఇక ఆ వీడియో షేర్ చేసిన కొద్ది క్షణాల్లోనే విపరీతమైన లైకులతో పాటు కామెంట్లు కూడా వస్తున్నాయి.

ఇక ఆ వీడియో చూసిన ప్రభాస్ అభిమానులు ప్రభాస్ చాలా అందంగా కనిపిస్తున్నాడు అని కామెంట్స్ పెడుతున్నారు.

ఇక ఇటీవలే ప్రభాస్ పెద్దనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణించిన సంగతి తెలిసిందే.కొన్ని రోజులు ప్రభాస్ షూటింగుకు బ్రేక్ ఇవ్వగా తాజాగా మళ్లీ షూటింగ్ లోకి వచ్చినట్లు అర్థమవుతుంది.

మొత్తానికి ప్రభాస్ మాత్రం వరుస ప్రాజెక్టులతో బాగా దూసుకుపోతున్నాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube