కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో అరుదైన గౌరవం అందుకున్న శాకుంతలం!

ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ గుణశేఖర్( Gunasekhar ) దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం శాకుంతలం ( Shaakuntalam ).ఈ సినిమా ఏప్రిల్ 14వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

 Sakunthalam Received A Rare Honor At Cannes Film Festival, Gunasekhar,shaakuntal-TeluguStop.com

ఇలా ఈ సినిమాలో సమంత ( Samantha ) శకుంతల పాత్రలో నటించారు.ఇలా ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఈ సినిమా మాత్రం ప్రేక్షకులు అంచనాలను ఏమాత్రం చేరుకోలేకపోయిందని చెప్పాలి.

ఇక ఈ సినిమా కలెక్షన్ల పరంగా నష్టాలను మిగిల్చడమే కాకుండా డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది.ఇలా ఈ సినిమా డిజాస్టర్ టాక్ వసంతం చేసుకున్నప్పటికీ కాన్స్ ఫిలిం ఫెస్టివల్ ( Cannes Film Festival ) లో మాత్రం అరుదైన గౌరవం అందుకుంది.

చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో అవార్డు వరించింది.ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ ( Best Caustume Designer ) విభాగంలో ఈ సినిమాకు కాన్స్ అవార్డు రావడం విశేషం.శాకుంతలం చిత్రానికి కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పని చేసిన నీతా లుల్లా ( Neethaa Lullaa ) కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ అవార్డు దక్కించుకుంది.తాజాగా ఈ విషయాన్ని కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ వెల్లడించింది.

 ఇక ఈ వేడుకలు ఈనెల 16 నుంచి 27వ తేదీ వరకు ఫ్రాన్స్ లో ఎంతో అంగరంగ వైభవంగా జరిగాయి.ఇక ఈ కార్యక్రమంలో పలువురు సెలబ్రిటీలు సైతం పెద్ద ఎత్తున సందడి చేశారు.

ఇక ఈ కాన్స్ ఫిలిం ఫెస్టివల్స్ కార్యక్రమం శనివారం సాయంత్రంతో ముగిసింది.ఈ క్రమంలోనే అవార్డులను ప్రకటించడంతో శాకుంతలం సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పని చేస్తునటువంటి నీతా లుల్లా ఈ అవార్డు అందుకోవడం విశేషం.ఇలా ఈ సినిమాకు ఇంత మంచి అవార్డు రావడంతో చిత్ర బృందం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇక సమంత ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ ( Vijay Devarakonda ) హీరోగా తెరకెక్కుతున్న ఖుషి ( Khushi ) సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube