ఒకే హీరోయిన్ తో సినిమా చేస్తున్న అక్కినేని బ్రదర్స్.. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే?

మన టాలీవుడ్ లో ఒకే కుటుంబం నుండి వచ్చిన హీరోలు చాలా మంది ఉన్నారు.వారితో నటించేందుకు నేటితరం యంగ్ బ్యూటీలు ఆసక్తి చూపించడం విశేషం.

 Sakshi Vaidya For Naga Chaitanya And Akhil Akkineni Details, Naga Chaitanya, Akhil, Ajent, Sakshi Vaidya, Nidhi Aggarwal, Pooja Hegde, Director Venkat Prabhu,thank You, Dootha, Surender Reddy-TeluguStop.com

ఇది అనుకోకుండా జరుగుతుందో లేదంటే హీరోయిన్ ల కొరత కారణంగా జరుగుతుందో తెలియదు కానీ అక్కినేని హీరోలు మాత్రం ఒకే బ్యూటీ తో ఇద్దరు అన్నదమ్ములు ఆడిపాడు తున్నారు.

ఇంతకు ముందు మెగా హీరోలతో ఇలా ఒకే హీరోయిన్ స్క్రీన్ షేర్ చేసుకోవడం జరిగేది.

 Sakshi Vaidya For Naga Chaitanya And Akhil Akkineni Details, Naga Chaitanya, Akhil, Ajent, Sakshi Vaidya, Nidhi Aggarwal, Pooja Hegde, Director Venkat Prabhu,thank You, Dootha, Surender Reddy-ఒకే హీరోయిన్ తో సినిమా చేస్తున్న అక్కినేని బ్రదర్స్.. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఇప్పుడు అక్కినేని బ్రదర్స్ వంతు వచ్చింది.నాగ చైతన్య సవ్యసాచి సినిమా చేసిన నిధి అగర్వాల్ తోనే ఆయన తమ్ముడు అఖిల్ మిస్టర్ మజ్ను చేసాడు.

అలాగే చైతూ ఒక లైలా కోసం సినిమా చేసిన బుట్టబొమ్మ పూజా హెగ్డే తోనే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా అఖిల్ చేసాడు.

ఇక ఇప్పుడు మరోసారి వీరిద్దరూ ఒకే బ్యూటీ తో స్క్రీన్ షేర్ చేసుకో బోతున్నారు.

అఖిల్ ప్రెసెంట్ నటిస్తున్న సినిమా ఏజెంట్.సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటుంది.ఈ సినిమాలో అఖిల్ కు జోడీగా కొత్త బ్యూటీ సాక్షి వైద్య నటిస్తున్న విషయం విదితమే.అయితే ఇదే హీరోయిన్ తో అఖిల్ బ్రదర్ నాగ చైతన్య కూడా స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి.

త్వరలోనే నాగ చైతన్య స్టార్ట్ చేయనున్నాడట.థాంక్యూ సినిమా తర్వాత ఈయన ఇప్పుడు దూత అనే వెబ్ సిరీస్ చేసున్నాడు.ఆ తర్వాత చైతూ నటించే ప్రాజెక్ట్ కోసం ఈమెను సెలెక్ట్ చేశారట.తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు డైరెక్టర్ చేయనున్న ఈ సినిమాలో సాక్షి వైద్య నటించే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

ఇలా అక్కినేని బ్రదర్స్ ఒకే హీరోయిన్ తో రొమాన్స్ చేస్తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube