ఆ అవార్డుకు నాకు అర్హత లేదా : రెజ్లర్ సాక్షిమాలిక్

క్రీడాకారులకు అవార్డులే గౌరవం.అవార్డులు, పతకాలను సాధించడానికి అహర్నిషలు కష్టపడుతుంటారు.

 Which Medal Should Win To Get Arjuna Award Says Sakshi Malik,  Commonwealth Wres-TeluguStop.com

వేరే దేశాలతో ఆడినప్పుడు దేశ పరువు ప్రతిష్టలు కాపాడే బాధ్యత వారి చేతుల్లోనే ఉంటుంది.క్రీడల్లో రాణించి స్వర్ణ, కాంస్య పతకాలను సాధించిన వారికి ప్రభుత్వం ఖేల్ రత్న, అర్జున అవార్డులు వంటివి అందిస్తోంది.

ఈ మధ్యకాలంలో కేంద్రం అర్జున అవార్డుకు సంబంధించిన అర్హుల జాబితాను కూడా ప్రకటించింది.అయితే 2016 ఒలంపిక్స్ లో కాంస్య పతకం సాధించిన రెజ్లర్ సాక్షిమాలిక్ కు అర్జున అవార్డులో స్థానం దక్కలేదు.

దీంతో ఆమె తీవ్ర నిరాశ చెందింది.ఈ మేరకు ఆమె భారత ప్రధాని నరేంద్రమోదీకి, క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజుజుకి లేఖ రాసింది.

లేఖలో సాక్షిమాలిక్ మాట్లాడుతూ.‘‘ 2016లో ఒలంపిక్స్ లో కాంస్య పతకం సాధించినప్పుడు రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డుతో సత్కరించారు.అందుకు నేను గర్వపడుతున్నాను.అయితే క్రీడాకారులకు అవార్డులే గౌరవం.

అందుకే ప్రతి క్రీడాకారుడు అవార్డు సాధించాలని తపన పడుతుంటాడు.నేను కూడా పురస్కారాలు పొందాలని అనుకున్నాను.

కానీ అది కుదరడం లేదు.ఈ ఏడాది ప్రకటించిన అర్జున అవార్డులో నా పేరు లేదు.

ఇంకా దేశం కోసం ఏం చేస్తే నాకా అవార్డు దొరుకుతుంది.’’ అంటూ ఆమె అడిగారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube