జగన్‌ను మళ్లీ ఇరికించిన సాక్షి!

ఇప్పుడు ప్రతి పార్టీకి, నేతకూ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సొంత మీడియా ఉంది.కొంతమంది నేరుగా అంగీకరించకపోయినా అది నిజం.

 Sakshi Kept In Jagan-TeluguStop.com

అలాగే ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డికి సాక్షి రూపంలో ఓ పేరున్న పత్రికే ఉంది.దీనిని సాక్షాత్తూ తాను, తన తండ్రి కలిసే ప్రారంభించారు కాబట్టి.

దాంతో ఎలాంటి సంబంధం లేదని చెప్పుకునే అవకాశం జగన్‌కు లేదు.

అయితే ఈ సొంత మీడియా పని ఏంటి? తమ యజమానులకు రాజకీయ లబ్ధి చేకూర్చడమే కదా.సాక్షి కూడా అదే చేసింది.చంద్రబాబు హయాంలో ఆయన తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తున్న ఎన్నో కథనాలు రాసింది.

అవి జగన్‌ అధికారంలోకి రావడానికి మేలు చేశాయి.కానీ ఇప్పుడవే కథనాలు జగన్‌కు కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి.

మొన్నటికి మొన్న సన్న బియ్యం విషయంలో తన సర్కార్‌ ఇరుక్కుపోతే.తన పత్రిక సాక్షే తప్పుగా రాసిందంటూ జగన్‌ చెప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.తాజాగా ఇంగ్లిష్‌ మీడియం విషయంలోనూ అదే సాక్షి పత్రికను అడ్డం పెట్టుకొని జగన్‌ సర్కార్‌ను ఇరికించే ప్రయత్నం చేశారు ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు.

గతంలో తాను పట్టణాల్లో ఇంగ్లిష్‌ ప్రవేశపెడితే జగన్‌ తీవ్రంగా వ్యతిరేకించారని, దీనికి సాక్షి పత్రికలో వచ్చిన కథనాలే సాక్ష్యమని బాబు చెప్పారు.

దీనిపై ఏం సమాధానం చెప్పాలో తెలియక జగన్‌ తికమకపడ్డారు.తన పత్రిక తననే ఇరికిస్తోందన్న అసహనం ఆయనలో కనిపించింది.ఎప్పుడో 2016లో సాక్షిలో వచ్చిన కథనాన్ని పట్టుకొని ఇప్పుడు రాద్ధాంతం చేస్తున్నారంటూ బాబుపై జగన్‌ ఎదురుదాడికి దిగారు.

అయితే గతంలో తాను తీవ్రంగా వ్యతిరేకించిన అంశాలనే ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్‌ అమలు చేస్తున్నారన్న విమర్శలు రోజురోజుకీ ఎక్కువవుతున్నాయి.

వీటికి సాక్షి పత్రక కథనాలే సాక్ష్యాలుగా నిలుస్తుండటం జగన్‌కు మింగుడు పడటం లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube