5 అవార్డ్స్ అందుకున్న అల వైకుంఠపురములో..సందడి చేసిన టీమ్!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అల వైకుంఠపురములో.ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ సక్సెస్ గా నిలిచింది.

 Sakshi Excellence Awards Ala Vaikunthapurramuloo Wins Five Awards-TeluguStop.com

కరోనా కు కొద్దిగా ముందు విడుదల అయ్యి ఈ సినిమా ఓ రేంజ్ లో సక్సెస్ అవ్వడంతో టీమ్ అంత ఖుషీ అయ్యారు.ఈ సినిమాలో ప్రతి సన్నివేశం ఇప్పటికి ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకుంది.

ఈ సినిమాలో అల్లు అర్జున్ పూజా హెగ్డే జంట కూడా ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకుంది.పాటలు, అల్లు అర్జున్ డాన్స్ అంతా కూడా ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేసాయి.

 Sakshi Excellence Awards Ala Vaikunthapurramuloo Wins Five Awards-5 అవార్డ్స్ అందుకున్న అల వైకుంఠపురములో..సందడి చేసిన టీమ్-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమాను ప్రజలకు దగ్గరగా వాస్తవికంగా తెరకెక్కించడంలో త్రివిక్రమ్ సక్సెస్ అయ్యాడనే చెప్పాలి.ఇంత సక్సెస్ సాధించిన ఈ చిత్రానికి సాక్షి ఎక్స్ లెన్స్ అవార్డ్స్ లో భాగంగా ఈ సినిమాకు ఐదు అవార్డ్స్ లభించాయి.

నిన్న హైదరాబాద్ లో గ్రాండ్ గా జరిగిన సాక్షి ఎక్స్ లెన్స్ అవార్డు ఫంక్షన్ లో తెలుగు ఉత్తమ చిత్రాలకు అవార్డ్స్ అందించారు.ఇందులో భాగంగా అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాకు కూడా వివిధ క్యాటగిరీలలో మొత్తం 5 అవార్డ్స్ లభించాయి.

అల్లు అర్జున్ కు ఉత్తమ నటుడిగా, పూజా హెగ్డే కు ఉత్తమ నటిగా అవార్డ్స్ లభించగా ఉత్తమ దర్శకుడిగా త్రివిక్రమ్, ఉత్తమ చిత్రం అవార్డు ను నిర్మాత రాధాకృష్ణ, ఇక చివరిగా ఉత్తమ మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్ కు అవార్డ్స్ లభించాయి.

ఇలా మొత్తం ఐదు క్యాటగిరీలలో అవార్డ్స్ లభించడంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేసింది.ఈ ఫంక్షన్ లో ఈ సినిమా యూనిట్ మొత్తం సందడి చేసింది.ఈ వేడుకలో 5 అవార్డ్స్ తో ఈ సినిమా మొదటి స్థానం సంపాదించగా ఈ విషయంపై అల్లు అర్జున్ ఆనందం తెలిపారు.

‘అల సాక్షి అవార్డ్స్’ అంటూ అల్లు అర్జున్ సోషల్ మీడియాలో తన సంతోషాన్ని వ్యక్తం చేసాడు.ఈ ఫంక్షన్ కు సంబందించిన ఫోటో కూడా షేర్ చేసాడు.ఇందులో చిత్ర యూనిట్ మొత్తం అవార్డ్స్ పట్టుకుని ఉన్నారు.ఈ పిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తుంది.

#Pooja Hegde #ProdcerRadha #Thaman #Hyderabad #Allu Arjun

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు