పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై కౌంటర్లు వేసిన సజ్జల రామకృష్ణారెడ్డి..!!

ఇటీవల తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భారీ బహిరంగ సభలో పాల్గొన్న సంగతి తెలిసిందే.ఏప్రిల్ 3 వ తారీఖున జరిగిన ఈ సభలో వైసిపి ఎమ్మెల్యేలను ఉద్దేశించి గూండాలు రౌడీలు అంటూ పవన్ కళ్యాణ్ కాంట్రవర్సీ కామెంట్ చేశారు.

 Sajjala Ramakrishna Reddy Counters To Pawan Kalyan-TeluguStop.com

రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారిపోయాయి అని, అదుపులో లేవని మండిపడ్డారు.ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ప్రభుత్వ సలహాదారుడు వైసిపి పార్టీ కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్లు వేశారు.

 Sajjala Ramakrishna Reddy Counters To Pawan Kalyan-పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై కౌంటర్లు వేసిన సజ్జల రామకృష్ణారెడ్డి..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

పవన్ కళ్యాణ్ కి సొంత అభిప్రాయమంటూ ఏదీ లేదని మండిపడ్డారు.రాత్రి ఒక పార్టీతో పగలు మరొక పార్టీతో చెట్టాపట్టాలేసుకుని రాజకీయాలు చేసే నేత పవన్ కళ్యాణ్ అన్నట్టు కౌంటర్ కామెంట్ చేశారు.2019 కి ముందు ఒక లాగా తరువాత మరొక లాగా ఎక్కడా కూడా నిలకడలేని తత్వం అతనిది అని మండిపడ్డారు.సినిమా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి కాబట్టి ఎవరైనా స్క్రిప్ట్ రాసిస్తే అది చదవటం తప్ప, పవన్ కళ్యాణ్ కి అంటూ ఒక అవగాహన లేదు అనే తరహాలో సజ్జల రామకృష్ణారెడ్డి సెటైర్లు వేశారు.

#Pawan Kalyan #TirupathiBy

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు