అందరికీ శత్రువుగా మారిపోతున్న ' సజ్జల ' ! ?

ఏపీ అధికార పార్టీ వైసీపీ నుంచి ఎవరు సస్పెండ్ అయినా,  ఎవరు అసంతృప్తికి గురైనా.మొదటగా ఆరోపణలు చేసేది ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసిపి కేలకనేత సజ్జల రామకృష్ణారెడ్డి పైనే.

 'sajjala' Is Becoming The Enemy Of All! Sajjala Ramakrishna Reddy, Jagan, Ysrcp-TeluguStop.com

జగన్ కు అత్యంత సన్నిహితుడుగా ముద్రపడిన సజ్జల రామకృష్ణారెడ్డి( Sajjala Ramakrishna Reddy ), జగన్ తర్వాత ఆ స్థాయిలో కీలకంగా వ్యవహరిస్తున్నారు.ఏ శాఖ పైన అయినా,  ఆయనే మాట్లాడుతూ క్లారిటీ ఇస్తూ ఉంటారు.

రాజకీయ ప్రత్యర్డులు చేసే విమర్శలను తిప్పి కొట్టడంలోనూ,  సొంత పార్టీలోని అసంతృప్తి నాయకుల పై వేటు వేయడంలోనూ , వారిని బుజ్జగించే ప్రయత్నాలు చేయడం లోనూ ఇలా అన్నిటిలోనూ సజ్జాల రామకృష్ణ రెడ్డిదే ప్రధాన పాత్ర.

Telugu Anamramnarayana, Ap, Jagan, Kotamsridhar, Sajjala, Ysrcp-Politics

 ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడినట్లుగా వైసిపి అనుమానించి, వారిపై సస్పెన్షన్ వేటు వేసింది.వారిలో ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి , ఉండవల్లి శ్రీదేవి( Undavally sridevi ) ఉన్నారు.వీరు నలుగురిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో  వీరు విడివిడిగా మీడియా సమావేశాలు నిర్వహించి వైసిపి ప్రభుత్వం పైన,  ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.

Telugu Anamramnarayana, Ap, Jagan, Kotamsridhar, Sajjala, Ysrcp-Politics

ఈ వ్యవహారం చోటు చేసుకోవడానికి కారణం సజ్జల రామకృష్ణారెడ్డి అంటూ విమర్శలు చేస్తున్నారు.పార్టీ , ప్రభుత్వ వ్యవహారాలు ఏవైనా ముందుగా సజ్జల రామకృష్ణారెడ్డి జగన్ దృష్టికి తీసుకు వెళ్తూ ఉంటారు .ఈయన ఇచ్చిన ఫీడ్ బ్యాక్  ఆధారంగానే జగన్ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు.దీంతో తమపై వేటు పడడానికి , వైసీపీలో ఈ తరహా గందరగోళం నెలకొనడానికి కారణం సజ్జల రామకృష్ణారెడ్డి కారణం అనే ఆగ్రహం ఈ నలుగురు ఎమ్మెల్యేల్లో నెలకొంది.

ఇదే కాదు నరసాపురం వైసిపి ఎంపీ రఘురామకృష్ణంరాజు ఇప్పుడు ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకుంటూ పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు.  ఈయన కూడా ప్రధానంగా సజ్జల రామకృష్ణారెడ్డి పైనే విమర్శలు చేస్తున్నారు.

ఇక ప్రతిపక్షాలు  సైతం అనేక సందర్భాల్లో సజ్జల రామకృష్ణ రెడ్డి ని టార్గెట్ చేస్తూనే జగన్ ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తూనే వస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube