ఏపీలో అధికార పార్టీ వైసీపీకి చెందిన సోషల్ మీడియా విభాగం బాధ్యతలను సజ్జల కుమారుడు భార్గవరెడ్డి స్వీకరించారు.భార్గవ రెడ్డికి అప్పగిస్తూ పార్టీ అధినేత వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఈ క్రమంలో తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయానికి వచ్చిన భార్గవ రెడ్డి సీఎం జగన్ తో సమావేశం అయ్యారు.ఈ సందర్భంగా పార్టీ సోషల్ మీడియాను మరింత బలోపేతం చేసే దిశగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించినట్లు సమాచారం.