తెలుగులో జరిగినట్లే బాలీవుడ్ లో కూడా… తేజు హీరోయిన్ దురదృష్టం  

Saiyami Kher Most Unlucky Heroine - Telugu Bollywood, Celebrities, Heroins,, South Cinema, Tollywood

హీరోయిన్ గా సక్సెస్ అందుకొని స్టార్ హీరోయిన్ గా ఎదగాలని ఫాషన్ ప్రపంచంలోకి వచ్చే ప్రతి అమ్మాయి అనుకుంటుంది.ఇక వారికి బాలీవుడ్ లాంటి ఇండస్ట్రీలో ఫ్యామిలి బ్యాగ్రౌండ్ తోడైతే సక్సెస్ లతో పాటు స్టార్ హీరోయిన్ క్రేజ్ కూడా వస్తుంది.

 Saiyami Kher Most Unlucky Heroine

అయితే స్టార్ హీరోయిన్స్ అయ్యే ఫీచర్స్ ఉన్న కూడా కొంత మంది భామలని దురదృష్టం వెంటాడుతుంది.ఫాషన్ రంగంలో తిరుగులేని ఇమేజ్ ఉన్న కూడా మొదటి సినిమా చేసే సమయంలోనే వరుసగా అవకాశాలు వచ్చిన ఆ సినిమా రిజల్ట్ తరువాత హీరోయిన్ కెరియర్ మీద కచ్చితంగా ప్రభావం చూపిస్తుంది.

అలా దురదృష్టం వెంట తెచ్చుకున్న హీరోయిన్ అంటే సయామీఖేర్ అని చెప్పుకోవాలి.

తెలుగులో జరిగినట్లే బాలీవుడ్ లో కూడా… తేజు హీరోయిన్ దురదృష్టం-Movie-Telugu Tollywood Photo Image

సాయి ధరమ్ తేజ్ హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన సినిమా రేయ్.

ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ కి జోడిగా నటించిన హీరోయిన్ సయామిఖేర్.అందాల ప్రదర్శనకి ఏ మాత్రం అడ్డు చెప్పకుండా మొదటి సినిమాలోనే రెచ్చిపోయిన ఈ అమ్మడుకి వై.వి.ఎస్.చౌదరి దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా సక్సెస్ అందిస్తుందని అందరూ అనుకున్నారు.తెలుగులో వైవిఎస్ ఇలియానాని పరిచయం చేసినట్లే మరో స్టార్ హీరోయిన్ ని పరిచయం చేస్తున్నాడు అనుకున్నారు.

అయితే ఆ సినిమా డిజాస్టర్ కావడంతో ఆమె ఆచూకీ టాలీవుడ్ లో కనిపించకుండా పోయింది.ఆ తర్వాత చాలా గ్యాప్ లో సయామీ బాలీవుడ్ చిత్రం మిర్జ్యాలో అవకాశం సొంతం చేసుకుంది.

అనిల్ కపూర్ తనయుడు హర్షవర్ధన్ కపూర్ ఈ సినిమాలో హీరోగా అరంగేట్రం చేయగా భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది.దీంతో అప్పటికే కమిట్ అయిన రెండు సినిమాల నుంచి కూడా ఈ అమ్మడుని తొలగించారు.

అందులో మణిరత్నం సినిమా కూడా ఉందని ఈ అమ్మడు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.మొత్తానికి మొదటి సినిమా ఎఫెక్ట్ స్టార్ హీరోయిన్ అవ్వాల్సిన భామకి అవకాశాలు దూరం చేయడం అంటే ఇదేనేమో.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Saiyami Kher Most Unlucky Heroine Related Telugu News,Photos/Pics,Images..

footer-test