తెలుగు సినిమాలో మునిగి వెబ్ సిరీస్ లో తేలిన తేజు హీరోయిన్

టాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్ వన్ మూవీ వండర్ గా మిగిలిపోతారు.మంచి ఇమేజ్ తో ఒక సినిమా చేసి ఆ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో మరి అవకాశాలు లేక కనుమరుగైపోతారు.

 Saiyami Kher Finally Gets Fame With Special Ops Web Series, Tollywood, Bollywood-TeluguStop.com

ఇలాంటి భామలు తెలుగులో చాలా మంది ఉన్నారు.వారి వరుసలో సయామీ ఖేర్ కూడా ఉంటుంది.

ముంబైలో మోడలింగ్ రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకొని బాలీవుడ్ స్క్రీన్ పై పాగా వేయాలని అనుకున్న టైంలో ఊహించని విధంగా తెలుగులో వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చే మూవీలో హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది.ఇక వైవిఎస్ చౌదరి హ్యాండ్ పడి ఇలియానా స్టార్ హీరోయిన్ అయినట్లు తను కూడా అయిపోతా అని భావించిన ఈ ముద్దుగుమ్మ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

అయితే ఆ సినిమా అనేక అవాంతరాలు ఎదుర్కొని, అతి కష్టం మీద రిలీజ్ అయ్యింది.వైవిఎస్ చౌదరి కెరియర్ లో అతిపెద్ద డిజాస్టర్ గా మిగిలింది.

ఇక ఆ సినిమా తర్వాత తేజు వెంటనే కోలుకొని పిల్ల నువ్వు లేని జీవితం సినిమాతో హిట్ కొట్టి సక్సెస్ ట్రాక్ లో పడ్డాడు.అయితే హీరోయిన్ సయామీ ఖేర్ మాత్రం కనుమరుగైపోయింది.

సినిమా అవకాశాలు రాకపోవడంతో పూర్తిగా మోడలింగ్ కి పరిమితం అయిపొయింది.అయితే ఇప్పుడు ఇలాంటి భామలకి కేరాఫ్ అడ్రెస్స్ గా వెబ్ సిరీస్ లు వచ్చాయి.

ఈ నేపధ్యంలో హాట్ స్టార్ లో స్పెషల్ ఓప్స్ అనే సిరీస్ లో సయామీ ఛాన్స్ దక్కించుకుంది.అందులో లేడీ స్పై గా సయామీ టఫ్ గా కనిపించడమే కాకుండా స్విమ్ సూట్స్ లో తన అందాలని ఆరబోసి ఆకట్టుకుంది.

మొదటి సీజన్లో తనకి ఎక్కువ స్క్రీన్ టైం లేకపోయినా కానీ ఆడియన్స్ కి ఆమె నచ్చడంతో సెకండ్ సీజన్లో లెంగ్త్ పెంచుతున్నారని తెలిసింది.మరి ఈ వెబ్ సిరిస్ లలో అయిన ఆమె నటిగా బెస్ట్ కెరియర్ అందుకుటుందో లేదో వేచి చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube